
RGV: ఇప్పుడు ‘అల్లు’నే కొత్త ‘మెగా’: వర్మ ఉద్దేశం ఏంటో?
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో ట్విటర్‌లో హల్‌చల్ చేశారు. ఇటీవల కాలంలో పలువురు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్న నేపథ్యంలో వివాహం బంధంపై ఆయన స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు. తెలివైన వ్యక్తులే ప్రేమిస్తారని, అమాయకులు పెళ్లి చేసుకుంటారని వ్యాఖ్యానించారు.
‘‘స్టార్ నటుల విడాకులు ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తున్నాయి. ఇవి వివాహమనేది ఎంత ప్రమాదకరమో యువతకు తెలిపే హెచ్చరికలాంటివి. ఈ కాలంలో వివాహబంధాలు పెళ్లి వేడుకలు జరిగినన్ని రోజులు కూడా నిలవట్లేదు. మూడు నుంచి ఐదు రోజుల్లోనే తెగిపోతున్నాయి. విడాకులతో వివాహబంధం నుంచి విముక్తి పొందినవారే సంగీత్ వేడుకను జరుపుకోవాలి’’అని ఆర్జీవీ పేర్కొన్నారు.
అంతేకాదు, టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌పై పరోక్షంగా ఆర్జీవీ మరో సంచలన ట్వీట్ చేశారు. ‘ఇప్పుడు అల్లునే కొత్త మెగా హీరో. ఇది కఠినంగానే ఉన్నా.. కాదనలేని వాస్తవం’’అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు మెగా, అల్లు అభిమానుల్లో గందరగోళం సృష్టిస్తోంది. ఏ ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారో తెలియాల్సి ఉంది.