RGV: కొత్త తరహా కథతో..

పూజా భాలేకర్‌ ప్రధాన పాత్రలో రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘అమ్మాయి’. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Updated : 17 Jul 2022 12:44 IST

పూజా భాలేకర్‌ (Pooja Bhalekar) ప్రధాన పాత్రలో రామ్‌గోపాల్‌ వర్మ (RGV) తెరకెక్కించిన చిత్రం ‘అమ్మాయి’ (Ammayi). ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ..‘‘ఇది కలల సినిమా అని ఎన్నోసార్లు చెప్పా. ‘ఎంటర్‌ ది డ్రాగన్‌’ చిత్రం చూసినప్పటి నుంచి అలాంటిది ఒకటి చేయాలని అనుకున్నా. పూజా భాలేకర్‌లా మార్షల్‌ ఆర్ట్స్‌ తెలిసిన అమ్మాయి దేశంలోనే లేరు. కొత్త తరహా కథతో సినిమా ప్రయత్నించాం. నాకెంతో సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రామ సత్యనారాయణ, టి.అంజయ్య పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని