RGV: సినిమా టికెట్ల అంశం.. మరోసారి స్పందించిన ఆర్జీవీ
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరోసారి స్పందించారు.
హైదరాబాద్: ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరోసారి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘మహారాష్ట్రలో ‘ఆర్ఆర్ఆర్’ టికెట్ల ధర రూ.2,200 వరకు అనుమతించారు. ఏపీలో మాత్రం రూ.200కు అమ్ముకోవడానికి అనుమతుల్లేవు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లలో రూ.2,200 వరకు టికెట్లు విక్రయిస్తున్నారు’’ అని ఆర్జీవీ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
సినిమా టికెట్ల అంశంపై ఇటీవల ఏపీ మంత్రి పేర్నినాని, ఆర్జీవీ మధ్య ట్వీట్ల వార్ జరిగింది. ఈ క్రమంలో మంత్రిని ఆర్జీవీ సోమవారం కలిశారు. టికెట్ ధరల అంశంపై పేర్ని నానితో ఆయన చర్చించారు. సమావేశం అనంతరం ఆర్జీవీ మాట్లాడుతూ తయారీదారులుగా సినిమా టికెట్ల ధరలపై నిర్ణయం తీసుకునే హక్కు నిర్మాతలకే ఉంటుందని, దాన్ని ఇంకొకరు తీసుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వానికి టికెట్ల ధరల నిర్ణయంలో ఎలాంటి హక్కు లేదని, తయారీదారులపై ఒత్తిడి తెచ్చి తక్కువ ధరకు విక్రయించేలా చేయడాన్ని అంగీకరించబోనని స్పష్టం చేశారు. సినిమాను రూ.300 కోట్లు పెట్టి తీసిన నిర్మాతలు దానికి అనుగుణంగా టికెట్ ధర ఎంత ఉండాలనేది నిర్ణయించే వీలుండాలని, ఇక్కడ జరిగే నగదు కార్యకలాపాల పారదర్శకత ఒక్కటే ప్రభుత్వానికి ముఖ్యమనేది తన అభిప్రాయమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ తాజాగా టికెట్ల ధరపై మళ్లీ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. -
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. -
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పారు. -
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
మనిషి కోరికలకు అంతం ఉండదని అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ సరదాగా అన్నారు. -
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
ఓ బాలీవుడ్ చిత్రంలో నటించినందుకు తనకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయని నటి ఇలియానా అన్నారు. -
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్‌కు హీరోయిన్ ఘాటు రిప్లై
మలయాళీ నటి మాళవిక మోహనన్ ఓ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చారు. ఏం జరిగిందంటే?
తాజా వార్తలు (Latest News)
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్‌భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్‌పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్‌లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!