RRR: రెండు విడుదల తేదీలు

కరోనా మూడో దశ ప్రభావంతో ఇటీవల మరోమారు వాయిదా పడిన ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’... కొత్తగా రెండు విడుదల తేదీల్ని ఖరారు చేసింది. అన్నీ అనుకూలమైతే మార్చి 18న విడుదలకి సిద్ధమనీ, లేదంటే ఏప్రిల్‌ 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించాయి

Updated : 22 Jan 2022 07:13 IST

కరోనా మూడో దశ ప్రభావంతో ఇటీవల మరోమారు వాయిదా పడిన ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’... కొత్తగా రెండు విడుదల తేదీల్ని ఖరారు చేసింది. అన్నీ అనుకూలమైతే మార్చి 18న విడుదలకి సిద్ధమనీ, లేదంటే ఏప్రిల్‌ 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించాయి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినీ వర్గాలు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించిన చిత్రమిది. రూ.400 కోట్లకిపైగా వ్యయంతో రూపొందిన ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం కరోనాతో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల తేదీపై ఓ స్పష్టతనిచ్చింది చిత్రబృందం. దేశంలో మహమ్మారి పరిస్థితులు మెరుగుపడి, అన్ని థియేటర్లు పూర్తి సామర్థ్యంతో పునః ప్రారంభమైతే మార్చి 18న విడుదల చేయడానికి తాము సిద్ధమని ప్రకటించింది. లేదంటే ఏప్రిల్‌ 28న విడుదల చేస్తామని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని