Sai Pallavi: నేను ఇష్టపడేదాన్ని తెరపై చూపిస్తానంతే
గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ సినిమాల్లో అందంగా కనిపించాలని తపనపడుతుంటారు ఎక్కువ శాతం కథానాయికలు. సినిమాల్లోనే కాదు బయటకి కూడా మేకప్ లేకుండా రావడానికి ఇష్టపడరు.
గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ సినిమాల్లో అందంగా కనిపించాలని తపనపడుతుంటారు ఎక్కువ శాతం కథానాయికలు. సినిమాల్లోనే కాదు బయటకి కూడా మేకప్ లేకుండా రావడానికి ఇష్టపడరు. కానీ, తనకు మేకప్ లేకుండా నటించడమే ఇష్టమంటోంది సాయిపల్లవి (Sai Pllavi). ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినిమాలలో మేకప్ గురించి తనకు ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పింది. ‘తెరపై అందంగా కనిపించాలంటే చాలా ఒత్తిడి ఉండవచ్చు. మరింత అందంగా కనిపించడానికి మేకప్ సహాయం చేయదని నేను చెప్పడం లేదు. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తే వేసుకోవచ్చు. నాకు మేకప్ లేకుండా కూడా నటించగలననే నమ్మకం ఉంది’ అని చెప్పింది. డ్యాన్స్ విషయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె సినిమాల్లో డ్యాన్స్ విషయంలో ఐశ్వర్వరాయ్, మాధురీ దీక్షిత్, సరోజ్ ఖాన్‌లను ఆదర్శంగా తీసుకుంటానని చెప్పింది. ‘నన్ను క్రమశిక్షణలో ఉంచడంలో, నా శరీరంలో ఒక విధమైన లయను తీసుకురావడంలో డ్యాన్స్ ప్రధాన పాత్ర పోషిస్తుందని నేను అనుకోలేదు. నేను సినిమా స్టార్‌ని కాదు. కేవలం నేను ఇష్టపడే దాన్ని తెరపై చూపించే అవకాశాన్ని పొందినట్లుగా భావిస్తానంతే’ అని చెప్పింది సాయి పల్లవి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: షిర్లీ సేతియా ‘స్ట్రాబెర్రీ కేక్’.. ‘బ్లూ ఏంజెల్’లా ప్రియా వారియర్.. కృతిశెట్టి శారీ
-
General News
Tirupati: గోవిందరాజస్వామి ఆలయంలో అపశ్రుతి.. రావిచెట్టు కూలి వ్యక్తి మృతి
-
Movies News
Varun Tej - Lavanya Tripati: వరుణ్ తేజ్ అక్కడ - లావణ్య ఇక్కడ.. పెళ్లి వార్తలు నిజమేనా?
-
Politics News
TDP: ‘బాబాయిని చంపిందెవరు’.. యువగళం పాదయాత్రలో పోస్టర్లతో ప్రదర్శన
-
Sports News
AUS vs IND WTC Final: జూలు విదల్చాలి.. గద పట్టాలి!
-
Crime News
Hyderabad: ‘25న నా పెళ్లి.. జైలుకెళ్లను’.. కోర్టులో రిమాండ్ ఖైదీ వీరంగం