Saipallavi: ఆ వీడియో వైరలయ్యాకే పొట్టి దుస్తులు వేసుకోకూడదనుకున్నా: సాయిపల్లవి
అనుకోనివిధంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డాక్టర్ నుంచి యాక్టర్‌గా మారి విభిన్న కథలతో ప్రేక్షకులకు చేరువైన నటి సాయిపల్లవి. ‘ప్రేమమ్’తో...
నటిని ఇబ్బంది పెట్టిన వీడియో ఏంటంటే..?
హైదరాబాద్: వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని.. డాక్టర్ నుంచి యాక్టర్‌గా మారి విభిన్న కథలతో ప్రేక్షకులకు చేరువైన నటి సాయిపల్లవి. ‘ప్రేమమ్’తో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ‘ఫిదా’తో తెలుగువారికి చేరువయ్యారు. ప్రస్తుతం ఆమె కథానాయికగా నటించిన ఇంటెన్స్ లవ్ స్టోరీ ‘విరాటపర్వం’. 1990ల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో నటుడు రానా.. రవన్న అనే విప్లవ నాయకుడిగా నటించారు. వేణు ఊడుగుల దర్శకుడు. జూన్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సాయిపల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇప్పటివరకూ చేసిన పాత్రలన్నీ తనకెంతో సంతృప్తినిచ్చాయని, నటిగా కెరీర్ ముగిసిందని భావించిన సమయంలో మళ్లీ వైద్య వృత్తిలోకి అడుగుపెడతానని ఆమె అన్నారు.
అనంతరం పొట్టి దుస్తులు ధరించడంపై స్పందిస్తూ.. ‘‘మాది సాంప్రదాయ కుటుంబం. మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. నాకొక చెల్లి ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు మేము టెన్నిస్, షటిల్ ఆడుతుంటాం. ఆ సమయంలో ఆటకు సౌకర్యంగా ఉండేలా పొట్టి దుస్తులే వేసుకుంటాను. అయితే, నటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలో జరిగిన ఓ సంఘటనతో సినిమాల్లో పొట్టిదుస్తులు వేసుకోకూడదని ఫిక్స్ అయిపోయా. వైద్య విద్య నేర్చుకోవడానికి జార్జియా వెళ్లినప్పుడు అక్కడ టాంగో డ్యాన్స్ నేర్చుకున్నాను. టాంగో డ్యాన్స్ నేర్చుకోవాలంటే.. దానికి వీలుగా ఉండే కాస్ట్యూమ్స్ మాత్రమే ధరించాలి. అదే విషయాన్ని అమ్మ వాళ్లకు చెప్పి వాళ్లు ఓకే అన్నాక, దుస్తుల విషయంలో నేనూ సౌకర్యంగా ఫీలయ్యాకే ఆ డ్యాన్స్ నేర్చుకున్నాను. ఆ తర్వాత కొన్నాళ్లకే ‘ప్రేమమ్’లో నటించే అవకాశం వచ్చింది. అందరి నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. అదే సమయంలో నేను జార్జియాలో చేసిన టాంగో డ్యాన్స్ వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది. నెటిజన్లు దాన్ని చూసి, కామెంట్స్ చేసిన విధానం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ క్షణం నుంచి పొట్టి దుస్తులకు నో చెప్పడం మొదలుపెట్టాను’’ అని సాయిపల్లవి తెలిపారు.
‘‘మెగాస్టార్ చిరంజీవి నాకెంతో ఇష్టం. ఇక ఆయన డ్యాన్స్ అంటే పడిచస్తాను. ముఖ్యంగా ‘ముఠామేస్త్రి’ సాంగ్‌లో ఆయన వేసే స్టెప్పులు చూసి మురిసిపోయేదాన్ని. ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తా. ఆయన నటిస్తోన్న ‘భోళాశంకర్’లో అవకాశం వచ్చింది. రీమేక్స్ అంటే నాకెంతో భయం. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు తప్పకుండా ఒరిజినల్ పాత్రతో పోల్చి చూస్తుంటారు. ఆ భయంతోనే నేను ఆ ఆఫర్‌ని తిరస్కరించాను. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు’’ అని ఆమె వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. -
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. -
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పారు. -
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
మనిషి కోరికలకు అంతం ఉండదని అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ సరదాగా అన్నారు. -
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
ఓ బాలీవుడ్ చిత్రంలో నటించినందుకు తనకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయని నటి ఇలియానా అన్నారు. -
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్‌కు హీరోయిన్ ఘాటు రిప్లై
మలయాళీ నటి మాళవిక మోహనన్ ఓ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చారు. ఏం జరిగిందంటే?
తాజా వార్తలు (Latest News)
-
ఉక్రెయిన్‌పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్‌భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్‌పై సాక్షి పోస్ట్