Samantha :అందుకే ‘సిటాడెల్‌’ ప్రత్యేకం!

‘‘ప్రతి ఒక్కరికి జీవితంలో చీకటి రోజులు ఉంటాయి. ఓర్పుతో ముందుకెళ్తే కెరీర్‌ చాలా అందంగా ఉంటుంద’’ని చెబుతోంది అగ్ర కథానాయిక సమంత.

Updated : 25 Mar 2024 09:21 IST

‘‘ప్రతి ఒక్కరికి జీవితంలో చీకటి రోజులు ఉంటాయి. ఓర్పుతో ముందుకెళ్తే కెరీర్‌ చాలా అందంగా ఉంటుంద’’ని చెబుతోంది అగ్ర కథానాయిక సమంత. అనారోగ్య కారణాలతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇటీవలే మళ్లీ చిత్రీకరణలకు సిద్ధమైనట్లు తెలిపింది. త్వరలో ‘సిటాడెల్‌: హనీ-బన్నీ’ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించడానికి ముస్తాబవుతున్న ఆమె.. ఈ సిరీస్‌ ఎంతో శారీరక శ్రమతో కూడినదని తెలిసినా ఒప్పుకున్నానంది. తాజాగా ఆమె తన పాడ్‌కాస్ట్‌లో భాగంగా ‘సిటాడెల్‌’ షూటింగ్‌లో తాను ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నానంటూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘‘మయోసైటిస్‌ సమస్య క్రమక్రమంగా తగ్గుతుందని అనుకున్నాను. అయినా మానసికంగా దృఢంగా ఉంటే దేన్నైనా జయించవచ్చని అర్థం చేసుకున్నాను. ఈ సమస్యతో బాధపడుతున్న నాకు ‘సిటాడెల్‌’ చిత్రీకరణ ఎంతో కష్టంగా అనిపించింది. శారీరకంగా బలహీనంగా ఉన్నా.. ఇందులో చాలా యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని తెలిసినా ఓకే చెప్పాను. ఒకరోజు యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు నాలో శక్తి నశించడంతో చాలా నీరసంగా అయిపోయి స్పృహ తప్పి పడిపోయాను. దీంతో సెట్లో అందరు ఆందోళన పడ్డారు.. ఈ సిరీస్‌ చిత్రీకరణ ఎంత కష్టపడి పూర్తి చేశానో నాకు మాత్రమే తెలుసు. అందుకే నా కెరీర్‌లోనే ఇది ఎప్పటికీ ప్రత్యేకమైనదే. ఇప్పుడీ సిరీస్‌ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాన’ని చెప్పుకొచ్చింది సమంత. ఆమె, వరుణ్‌ ధావన్‌ నటించిన ఈ సిరీస్‌ విడుదలకు సిద్ధమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని