OTTలో ‘ఏక్‌ మినీ కథ’..?

‘పేపర్‌ బాయ్‌’, ‘తను నేను’లాంటి చిత్రాల్లో అలరించిన యువహీరో సంతోష్‌ శోభన్ నటిస్తున్న చిత్రం ‘ఏక్‌ మినీ కథ’. కార్తీక్‌ రాపోలు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కావ్య థప్పర్‌ నాయికగా నటిస్తోంది. యూవీ కాన్సెప్ట్స్‌ పతాకంపై  నిర్మితమౌతోంది. చిత్రానికి ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథను అందించడం విశేషం. కరోనా వైరస్ లేకుంటే సినిమా ఏప్రిల్‌ 30న ప్రేక్షకుల ముందుకొచ్చేది.

Published : 13 May 2021 20:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘పేపర్‌ బాయ్‌’, ‘తను నేను’లాంటి చిత్రాల్లో అలరించిన యువహీరో సంతోష్‌ శోభన్ నటిస్తున్న చిత్రం ‘ఏక్‌ మినీ కథ’. కార్తీక్‌ రాపోలు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కావ్య థప్పర్‌ కథానాయిక. యూవీ కాన్సెప్ట్స్‌ పతాకంపై నిర్మితమౌతోంది. చిత్రానికి ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథను అందించడం విశేషం. కరోనా ఉద్ధృతి లేకుంటే ఈ చిత్రం ఏప్రిల్‌ 30న ప్రేక్షకుల ముందుకొచ్చేది.

తాజాగా చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ ఆసక్తి కనబరుస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఓ ప్రముఖ డిజిటల్‌ మీడియా సినిమాకి సంబంధించిన ప్రసార హక్కుల్ని కొనుగోలు చేసిందని చెప్పుకుంటున్నారు. మే 27న సినిమా ఓటీటీ వేదిక ద్వారా ప్రసారం కానుందని సమాచారం. అయితే దీనిపై అధికారికంగా చిత్రబృందం ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ఇప్పటికే చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌, పాట ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో శ్రద్ధాదాస్‌, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, హర్షవర్దన్‌, సుదర్శన్‌, సప్తగిరి, కేశవ్ దీపక్ తదితరులు నటిస్తున్నారు. ప్రవీణ్‌ లక్కరాజు సంగీత స్వరాలు సమకూర్చగా గోకుల్‌ భారతి సినిమాటోగ్రాఫర్‌ పనిచేశారు. సత్య.జి ఎడిటర్‌గా వ్యవహరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని