Sara Ali Khan: ‘స్కై ఫోర్స్’లో సారాతో నటించేది అతడేనా?
ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ పహారియా తనయుడైన వీర్ పహారియాతో కథానాయిక సారా అలీ ఖాన్ ప్రేమలో ఉన్నట్టూ, కొంత కాలానికి వారిద్దరూ విడిపోయినట్టూ అప్పట్లో వార్తలొచ్చాయి.
ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ పహారియా తనయుడైన వీర్ పహారియాతో కథానాయిక సారా అలీ ఖాన్ (Sara Ali Khan) ప్రేమలో ఉన్నట్టూ, కొంత కాలానికి వారిద్దరూ విడిపోయినట్టూ అప్పట్లో వార్తలొచ్చాయి. వాటిలో నిజానిజాలు ఎలా ఉన్నా ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి తెరపై కనిపించబోతున్నట్లు సమాచారం. అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్ జంటగా సందీప్ కేవ్లానీ దర్శకత్వంలో ‘స్కై ఫోర్స్’ (Sky Force) సినిమా రానుంది. దినేష్ విజన్, జీ స్టూడియో ప్రొడక్షన్ సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సారా తన మాజీ ప్రేమికుడు వీర్ పహారియాతో కలిసి అలరించనుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇదే నిజమైతే వీర్‌కు ఇదే తొలి చిత్రం అవుతుంది. ఈ సినిమా షూటింగ్ మే నెలలో మొదలైంది. వివిధ ప్రదేశాలలో మూడు నెలల పాటు చిత్రీకరణ జరగనుంది. ప్రస్తుతం లండన్‌లో షూటింగ్‌ని జరుపుకుంటోంది చిత్రబృందం. అక్కడ భారతదేశంలోని కొన్ని ప్రదేశాలను సినీ బృందం రీక్రియేట్ చేసింది.. 2024లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ