Shahid Kapoor: కరీనాతో ముద్దు ఫొటోలు లీక్‌.. 18 ఏళ్ల తర్వాత స్పందించిన షాహిద్‌

సుమారు 18 ఏళ్ల క్రితం తన జీవితంలో చోటుచేసుకున్న ఓ సంఘటన గురించి నటుడు షాహిద్‌ కపూర్‌ (Shahid Kapoor) తాజాగా పెదవి విప్పారు. ఆ సమయంలో తాను గందరగోళానికి గురయ్యానని చెప్పారు.

Updated : 08 Jul 2023 19:11 IST

ముంబయి: బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ (Kareena Kapoor) నటుడు షాహిద్‌ కపూర్‌ (Shahid Kapoor) కొన్నేళ్ల క్రితం రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అనుకోని కారణాలతో వీరిద్దరూ విడిపోయారు. అయితే, వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు ఈ జంటకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట లీక్‌ అయ్యాయి. అందులో షాహిద్‌ - కరీనా ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. కాగా, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు లీక్‌ కావడంపై సుమారు 18 ఏళ్ల తర్వాత షాహిద్‌ తొలిసారి మాట్లాడారు.

‘‘ఆ సంఘటన జరిగిన సమయంలో నా వయసు 24 ఏళ్లు. ముద్దు ఫొటోలు బయటకు రావడంతో ఎంతో బాధపడ్డా. నా జీవితం నాశనం అయ్యిందనిపించింది. నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగింది. ప్రైవసీని కాపాడుకోవడానికి ఇక ఏం చేయలేననిపించింది. గందరగోళానికి గురయ్యా. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ఆ పరిస్థితులు నన్నెంతో బాధించాయి. తెలిసీ తెలియని వయసులో ఒక అమ్మాయితో రిలేషన్‌లో ఉండటం.. ఆ వెంటనే ఇలాంటివి చోటుచేసుకోవడంతో ఎంతో బాధపడ్డా. ఇక, ఇప్పుడు నాకు పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు. కాబట్టి, నా పర్సనల్‌ లైఫ్‌పై ఎవరికీ అంత ఆసక్తి ఉండదు’’ అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షాహిద్‌ తెలిపారు.

అనంతరం ఆయన ‘కబీర్‌సింగ్‌’ (అర్జున్‌రెడ్డి రీమేక్‌)కు వచ్చిన వ్యతిరేకతపై మాట్లాడుతూ.. ‘‘కబీర్‌ సింగ్‌’ విడుదలైనప్పుడు.. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఇష్టపడటాన్ని కొంతమంది అంగీకరించలేకపోయారు. ప్రేక్షకులే ఇష్టపడుతున్న సమయంలో మమ్మల్ని ప్రశ్నించడానికి మీరెవరు? నా ఉద్దేశం ఏమిటంటే.. ప్రేమలో ప్రతి ఒక్కరికీ సెకండ్‌ ఛాన్స్‌ ఉండాలి.  ఇది కేవలం ఒక సింపుల్‌ అమ్మాయి, టాలెంట్‌, కోపం కలిగిన అబ్బాయిల ప్రేమకథ మాత్రమే’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని