Chinmayi: సమంతను స్ఫూర్తిగా తీసుకోండి: చిన్మయి పోస్ట్‌

నటి సమంత (Samantha)ను ఉద్దేశిస్తూ గాయని చిన్మయి(Chinmayi) ఓ ట్వీట్‌ చేశారు. ఇందులో ఆమె సమంత గొప్పతనాన్ని తెలియజేశారు.

Updated : 03 Sep 2023 19:05 IST

హైదరాబాద్‌: తన స్నేహితురాలు, నటి సమంత(Samantha) ను ఉద్దేశిస్తూ గాయని చిన్మయి (Chinmayi) తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. సమంత ఒక స్ఫూర్తి అంటూ ఆమె పేర్కొన్నారు. జీవితం, కెరీర్‌కు సంబంధించిన పలు విషయాల్లో సమంతను ప్రేరణగా తీసుకోవాలని ఆమె చెప్పారు. సోషల్‌మీడియా వేదికగా నిందలు వేసేవారిని ఉద్దేశిస్తూ.. కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడారు. అందరి దృష్టిని ఆకర్షించి డబ్బులు సంపాదించడం కోసం అసభ్యకరంగా మాట్లాడితే ఏదో ఒక రోజు ఇబ్బంది ఎదుర్కొంటారని అన్నారు.

ఎన్టీఆర్‌ తప్ప.. బాలీవుడ్‌లో ఆ రోల్‌ ఎవరూ చేయలేరు: బీటౌన్‌ దర్శకుడు

‘‘ఎన్ని నిందలు ఎదురైనా హుందాగా ముందుకు ఎలా సాగాలో నేర్చుకోవాలంటే సమంతను స్ఫూర్తిగా తీసుకోండి. తన అనారోగ్యం కారణంగా ఓ ప్రాజెక్ట్‌ ఆలస్యమైంది. ఆ ప్రాజెక్ట్‌ కోసం తన పారితోషికాన్ని తగ్గించుకుంది. వచ్చే డబ్బును వద్దనే వారు ఈ కాలంలో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. సోషల్‌మీడియాలో విపరీతమైన నెగెటివిటీ వచ్చినప్పుడు.. తాను మయోసైటిస్‌తో ఇబ్బందిపడుతున్నట్లు చెప్పి.. ఆ సమస్యపై అందరికీ అవగాహన కల్పించడానికి తను ఎంతో కష్టపడుతోంది.

‘ఈ అమ్మాయి కెరీర్‌ అయిపోయింది’ అని పలువురు కామెంట్‌ చేస్తున్న సమయంలో బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు వెళ్లి తన సత్తా చాటుతోంది. ఎవరు ఎన్ని రకాలుగా దూషించినా.. అసభ్యకరంగా మాట్లాడినా వాటిని పట్టించుకోకుండా జీవితంలో ముందుకు సాగుతోంది. ట్విటర్‌లో  ఎంగేజ్‌మెంట్స్‌, మానిటైజేషన్‌ అనే గోలతో కొంతమంది ఇటీవల నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు. కర్మ సిద్ధాంతం అనేది ఎంతో ఆసక్తి కలిగిన అంశం. ఒకరి గురించి అదే పనిగా అబద్ధాలు చెబుతూ దూషిస్తూ ఉంటే ఆ పాపం మొత్తం పేరుకుని ఏదో ఒకరోజు మనకే ఎదురుతిరుగుతుంది. డబ్బులు సంపాదించినా.. ఆస్తులు ఉన్నా ఏం లాభం లేదు. తరతరాలకు ఆ కర్మ ఫలం వర్తిస్తుంది. అది ఒక్కసారి మొదలైతే.. వినోదం మామూలుగా ఉండదు.’’ అని ఆమె పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని