singham: రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘సింగమ్‌’ పోరాటాలు

ఒక చిత్రం నచ్చిందంటే దానికి కొనసాగింపుగా ఎన్ని సీక్వెల్స్‌ వచ్చిన మంచి విజయాన్ని అందిస్తారు సినీ ప్రియులు. ఆ విషయాన్ని ‘సింగమ్‌’ ఫ్రాంచైజీ సినిమాల పరంగా నిజం చేశారు. 2011లో రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

Updated : 12 Jan 2024 09:41 IST

ఒక చిత్రం నచ్చిందంటే దానికి కొనసాగింపుగా ఎన్ని సీక్వెల్స్‌ వచ్చిన మంచి విజయాన్ని అందిస్తారు సినీ ప్రియులు. ఆ విషయాన్ని ‘సింగమ్‌’ ఫ్రాంచైజీ సినిమాల పరంగా నిజం చేశారు. 2011లో రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘సింగమ్‌ అగైన్‌’. అజయ్‌ దేవగణ్‌, అక్షయ్‌ కుమార్‌, రణ్‌వీర్‌ సింగ్‌, టైగర్‌ ష్రాఫ్‌, జాకీ ష్రాఫ్‌, అర్జున్‌ కపూర్‌, కరీనా కపూర్‌, దీపికా పదుకొణె లాంటి భారీ తారాగణంతో రోహిత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోంది. భారీ వాహనాల మధ్య బ్లాస్టింగ్‌ నేపథ్యంలో సాగే యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని