Japan: జపాన్‌..ఆద్యంతం వినోదాత్మకం

‘‘జపాన్‌’ సినిమా.. పాత్ర ప్రేక్షకుల మదిలో చాలాకాలం నిలిచిపోతుంది’’ అంటున్నారు నిర్మాత ఎస్‌.ఆర్‌.ప్రభు.

Updated : 06 Nov 2023 13:41 IST

‘‘జపాన్‌’ సినిమా.. పాత్ర ప్రేక్షకుల మదిలో చాలాకాలం నిలిచిపోతుంది’’ అంటున్నారు నిర్మాత ఎస్‌.ఆర్‌.ప్రభు. కార్తి కథానాయకుడిగా రాజు మురుగన్‌ తెరకెక్కించిన చిత్రమే ‘జపాన్‌’. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. ఈనెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విలేకరులతో చిత్ర విశేషాలు పంచుకున్నారు నిర్మాత ఎస్‌.ఆర్‌.ప్రభు.

  • ‘‘ఈ చిత్రంలో జపాన్‌ పాత్రను కార్తి అద్భుతంగా పోషించారు. ఆయన జీవితంలో అను పాత్ర చాలా ప్రత్యేకం. జపాన్‌లాగే ఆమె పాత్ర కూడా మనం ఊహించనట్టుగా ఉంటుంది. ఆ పాత్ర ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్‌ సంగీతం చేసిన విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అది థియేటర్లలో ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుంది. పాటలన్నీ విభిన్నంగా ఉంటాయి. ఇలాంటి సినిమాలు చాలాకాలం నిలుస్తాయి’’.
  • ‘‘ప్రస్తుతం మా సినీ ప్రయాణం చాలా వైవిధ్యంగా సాగుతోంది. భిన్నమైన చిత్రాల్ని నిర్మిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందడం నిర్మాతగా చాలా ఆనందాన్నిస్తోంది. ప్రస్తుతం మేము కీర్తి సురేష్‌తో ‘కన్నివెడి’, రష్మికతో ‘రెయిన్‌ బో’ నిర్మిస్తున్నాం. ఈ రెండూ వేటికవే ప్రత్యేకమైన చిత్రాలు’’.
  • ‘‘జపాన్‌’ పూర్తిగా క్యారెక్టర్‌ బేస్డ్‌ సినిమా. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. ఇందులో నేటి సమాజాన్ని ప్రతిబింబించే అంశాలెన్నో ఉన్నాయి. అలాగే మానవత్వం గురించి ఉంటుంది. జపాన్‌ పాత్ర సీరియస్‌గానే ఉంటుంది. అయితే అతను ఏదైనా ఒక విషయాన్ని చూసే తీరు.. మాట్లాడే విధానం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతాయి. ఈ సినిమాని కచ్చితంగా అందరూ ఎంజాయ్‌ చేస్తారు’’.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని