Akhanda: డిసెంబరు 2న థియేటర్లో దబిడి దిబిడే: శ్రీకాంత్
బాలకృష్ణతో ‘శ్రీరామ రాజ్యం’లో లక్ష్మణుడిగా చేశానని, ఇప్పుడు ‘అఖండ’లో రావణాసురుడిలాంటి పాత్ర చేస్తున్నానని నటుడు శ్రీకాంత్ అన్నారు.
హైదరాబాద్: బాలకృష్ణతో ‘శ్రీరామ రాజ్యం’లో లక్ష్మణుడిగా చేశానని, ఇప్పుడు ‘అఖండ’లో రావణాసురుడిలాంటి పాత్ర చేస్తున్నానని నటుడు శ్రీకాంత్ అన్నారు. ‘అఖండ’ ప్రీరిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ‘‘సరైనోడు’ తర్వాత నాకు మంచి పాత్ర ఇస్తానని బోయపాటి చెప్పారు. అది కూడా విలన్ క్యారెక్టర్ అన్నారు. నాకు నమ్మ బుద్ధి కాలేదు. కానీ, ‘అఖండ’లో వరదరాజు పాత్ర చెప్పిన తర్వాత మరో ఆలోచన లేకుండా ఒప్పుకొన్నా. నా పాత్రకు సంబంధించిన గెటప్ కోసం బోయపాటి చాలా కష్టపడ్డారు. షూటింగ్‌కు వెళ్లిన మొదటిరోజే బాలకృష్ణతో నటించే అవకాశం వచ్చింది. మొదట కాస్త భయపడ్డాను. బాలకృష్ణ వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ సినిమాతో మీరొక కొత్త శ్రీకాంత్‌ను చూస్తారు. డిసెంబరు 2న థియేటర్లలో దబిడి దిబిడే’’ అని శ్రీకాంత్ అన్నారు.
తాను ఇప్పటివరకూ చాలా మంది ఆర్టిస్ట్‌లతో పనిచేశానని, కానీ ఎప్పుడూ ఎనర్జీతో ఉంటూ, తోటి నటీనటుల పట్ల వినయంగా ఉండే బాలకృష్ణలాంటి నటుడిని చూడలేదని నటి పూర్ణ అన్నారు. బాలకృష్ణతో పనిచేయడం తన గాడ్‌ఫాదర్‌తో పనిచేసినట్లు ఉందని అన్నారు. బాలకృష్ణ నటన గురించి ప్రత్యేకంగా క్లాస్‌లు చెప్పవచ్చని అన్నారు. బాలకృష్ణతో నటించే అవకాశం రావటం అదృష్టమని కథానాయిక ప్రగ్యా జైస్వాల్ అన్నారు. ఈ సినిమా ఒక చరిత్ర అవుతుందని చెప్పుకొచ్చారు. ప్రతి రోజూ షూటింగ్లో బాలకృష్ణను చూసి స్ఫూర్తి పొందానని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజమౌళి, అల్లు అర్జున్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. -
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
చిట్టిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రవేసుకుంది నటి ఫరియా అబ్దుల్లా. అమాయకమైన చూపులతోనూ నటనతోనూ ఆకట్టుకుంటున్న ఈ హైదరాబాదీ అమ్మాయి ‘ఆ ఒక్కటీ అడక్కు’లోని సిద్ధి పాత్రతో నవ్వులు పంచేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
-
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్‌ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
తలదించితే బానిసవి.. ఎత్తినావా నువ్వే బాదుషావి
‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్. -
అక్టోబరులో మొదలు!
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. -
రజనీ బయోపిక్ రానుందా?
సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. -
కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది
‘‘సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. -
మనం నవ్వుతుంటే ప్రేక్షకులు భయపడాలి!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్‌ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది
‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్ నాయిక తాప్సీ. -
సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది. -
ఇందులో అన్నీ ఉంటాయి
‘‘ప్రేక్షకులకు చాలా తృప్తినిచ్చే సినిమా ‘ప్రసన్న వదనం’. దీన్ని సీటు అంచున కూర్చొని ఆస్వాదిస్తారు. అదిరిపోయిందని చప్పట్లు కొడతారు’’ అన్నారు సుహాస్. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
-
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
-
దుబాయ్‌లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్‌లైన్స్
-
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
-
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్