
Sudheer Babu: మొదటిసారి నన్ను నేను నమ్ముకుని సినిమా తీద్దామనుకుంటున్నా!
హైదరాబాద్: ‘ఇన్ని రోజులు నన్ను నేను అమ్ముకుని సినిమాలు తీశాను. మొదటిసారి నన్ను నేను నమ్ముకుని సినిమా తీద్దామనుకుంటున్నా’ అంటున్నారు సుధీర్‌బాబు. ఆయన కథానాయకుడిగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. కృతిశెట్టి కథానాయిక. శనివారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో సుధీర్‌బాబు సినిమా దర్శకుడిగా కనిపించనున్నారు. ఒక అబ్బాయి జీవితాన్ని ఓ అమ్మాయి ఎలా ప్రభావితం చేసింది? అనూహ్యంగా వీళ్లు ఎలా ప్రేమలో పడ్డారు? ప్రేమతోపాటు వాళ్లు అనుకున్నది ఎలా సాధించారనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.