Tollywood: నవ్వులే.. నవ్వులు

సంపత్‌ కుమార్‌ హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘సురాపానం’. కిక్‌ అండ్‌ ఫన్‌.. అన్నది ఉపశీర్షిక. అఖిల్‌ భవ్య క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. ప్రగ్యా నయన్‌ కథానాయిక. ఈ చిత్ర

Updated : 22 Apr 2022 12:12 IST

సంపత్‌ కుమార్‌ హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘సురాపానం’. కిక్‌ అండ్‌ ఫన్‌.. అన్నది ఉపశీర్షిక. అఖిల్‌ భవ్య క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. ప్రగ్యా నయన్‌ కథానాయిక. ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు సాగర్‌ కె.చంద్ర గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘టీజర్‌ బాగుంది. మంచి థ్రిల్‌తో పాటు చక్కటి వినోదాన్ని అందిస్తున్న చిత్ర బృందానికి శుభాకాంక్షలు’’ అన్నారు. ‘‘ఇదొక ఫాంటసీ థ్రిల్లర్‌. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. మే చివరి వారంలో విడుదల చేస్తాం’’ అన్నారు హీరో, దర్శకుడు సంపత్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని