సుశాంత్‌సింగ్ శవపరీక్ష నివేదిక 17న!
నటుడు సుశాంత్‌సింగ్ మృతికి సంబంధించిన పలు విషయాలు..
దిల్లీ: నటుడు సుశాంత్‌సింగ్ మృతికి సంబంధించిన పలు కీలక విషయాలు త్వరలోనే బహిర్గతం కానున్నాయి. ఈ కేసుకు సంబంధించిన శవపరీక్ష నివేదికను దిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఈనెల 17న లేదా 20న సీబీఐకి అప్పగించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం నటుడి శరీర అంతర్భాగాల నుంచి సేకరించిన నమూనాలను ఎయిమ్స్ వైద్యబృందం పరిశీలిస్తోంది. మాదకద్రవ్యాలు వినియోగించాడా లేదా అనే నేపథ్యంలోనూ వాటికి పలు రకాల పరీక్షలు నిర్వహించనున్నారు. నటుడి కుటుంబసభ్యుల ఆరోపణలు, సోషల్ మీడియాలో అభిమానులు లేవనెత్తిన సందేహాల ఆధారంగా కూడా శవపరీక్ష నివేదికను అధ్యయనం చేయనుంది. మహారాష్ట్ర నుంచి పలు నమూనాలు అందాయని వాటిని పరిశీలిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. 17వ తేదీన మెడికల్ బోర్డు అధికారులు సమావేశమయ్యే అవకాశం ఉందని, అప్పుడే నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పుడు కుదరకపోతే దర్యాప్తులో పాల్గొన్న అన్ని ఏజెన్సీలతో 20న జరిగే సమావేశంలో సమర్పించనున్నట్లు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోపం రగిలితే.. మృత్యువుకైనా ముచ్చెమటే!
‘‘దూకే ధైర్యమ జాగ్రత్తా.. రాకే.. ఎగబడి రాకే.. దేవర ముంగిట నువ్వెంతే’’ అంటూ తన వీరత్వాన్ని పరిచయం చేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. -
తెలుగులో తొలి అడుగులు.. మెరిసేనా!
పాన్ ఇండియా సినిమాలకు చిరునామాగా నిలుస్తోంది తెలుగు చిత్రసీమ. కొన్నేళ్లుగా ఇక్కడి కథలకు, నటులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. అందుకే ఇప్పుడు ఉత్తరాది తారలూ మన కథల్లో భాగమయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. -
ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది
‘ఈరోజు ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఆదరిస్తోంది. తెలుగు నటీనటులు, దర్శకులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోంది. దీన్ని నిలబెట్టుకునేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు తీయాల’న్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్. -
జులైలో భారతీయుడు 2
కథానాయకుడు కమల్‌హాసన్.. దర్శకుడు శంకర్ల కలయికలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. వీళ్లిద్దరి నుంచి 1996లో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు కొనసాగింపుగా తెరకెక్కింది. -
తెరపై మ్యాజిక్ సృష్టిస్తా..
‘దర్శకులు నాకు సరిపోయే పాత్రలు ఇస్తే.. తెరపై మ్యాజిక్ చేసి చూపిస్తా’’ అంటోంది బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా. ఇటీవలే ‘హీరామండీ:ది డైమండ్ బజార్’తో ప్రేక్షకులను ఆకట్టుకుందీమె. -
నవ్విస్తూ.. కవ్విస్తూ.. కంటతడి పెట్టిస్తూ
‘రాజు యాదవ్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. అంకిత కారాట్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలోకి రానుంది. -
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..