సుశాంత్‌సింగ్‌ శవపరీక్ష నివేదిక 17న!

నటుడు సుశాంత్‌సింగ్‌ మృతికి సంబంధించిన పలు విషయాలు..

Updated : 15 Sep 2020 12:42 IST

దిల్లీ: నటుడు సుశాంత్‌సింగ్‌ మృతికి సంబంధించిన పలు కీలక విషయాలు త్వరలోనే బహిర్గతం కానున్నాయి. ఈ కేసుకు సంబంధించిన శవపరీక్ష నివేదికను దిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు ఈనెల 17న లేదా 20న సీబీఐకి అప్పగించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం నటుడి శరీర అంతర్భాగాల నుంచి సేకరించిన నమూనాలను ఎయిమ్స్‌ వైద్యబృందం పరిశీలిస్తోంది. మాదకద్రవ్యాలు వినియోగించాడా లేదా అనే నేపథ్యంలోనూ వాటికి పలు రకాల పరీక్షలు నిర్వహించనున్నారు. నటుడి కుటుంబసభ్యుల ఆరోపణలు, సోషల్ మీడియాలో అభిమానులు లేవనెత్తిన సందేహాల ఆధారంగా కూడా శవపరీక్ష నివేదికను అధ్యయనం చేయనుంది. మహారాష్ట్ర నుంచి పలు నమూనాలు అందాయని వాటిని పరిశీలిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. 17వ తేదీన మెడికల్ బోర్డు అధికారులు సమావేశమయ్యే అవకాశం ఉందని, అప్పుడే నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పుడు కుదరకపోతే దర్యాప్తులో పాల్గొన్న అన్ని ఏజెన్సీలతో 20న జరిగే సమావేశంలో సమర్పించనున్నట్లు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని