18 Pages: మొబైల్‌ ఫోన్‌.. పుస్తకంతో ప్రేమలో పడితే

నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘18 పేజీస్‌’. బన్నీ వాసు నిర్మాత. అల్లు అరవింద్‌   సమర్పిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు

Updated : 15 Nov 2021 07:28 IST

నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘18 పేజీస్‌’. బన్నీ వాసు నిర్మాత. అల్లు అరవింద్‌   సమర్పిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం   సామాజిక మాధ్యమాల్లో ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఒకవేళ ఓ ఫోన్‌.. పుస్తకంతో ప్రేమలో పడితే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? అయితే, 18న సిద్ధంగా ఉండండి’’ అంటూ ఆ పోస్టర్‌కు ఓ వ్యాఖ్యను జత చేశారు. ‘‘కొత్తదనం నిండిన ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. నిఖిల్‌, అనుపమల కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇద్దరూ మునుపెన్నడూ చూడని విధంగా విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది’’ అని చిత్ర బృందం తెలియజేసింది. సంగీతం: గోపీసుందర్‌, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: ఎ.వాసంత్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని