Anasuya: హీరోల్ని అలా అడగరెందుకు?.. సీనియర్‌ నటుడిపై అనసూయ ఫైర్‌

తన వస్త్రధారణపై కామెంట్‌ చేసిన ఓ సీనియర్‌ నటుడిపై అనసూయ ఫైర్‌ అయ్యారు. ఎవరికి ఇష్టమొచ్చిన దుస్తులు వారు ధరిస్తారని, అది వ్యక్తిగతమని మండిపడ్డారు.

Published : 19 Oct 2021 02:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన వస్త్రధారణపై కామెంట్‌ చేసిన ఓ సీనియర్‌ నటుడిపై అనసూయ ఫైర్‌ అయ్యారు. ఎవరికి ఇష్టమొచ్చిన దుస్తులు వారు ధరిస్తారని, అది వ్యక్తిగతమని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ పెట్టారు. ‘నా వస్త్రధారణ గురించి ఓ సీనియర్‌ యాక్టర్‌ చేసిన కామెంట్లని ఇప్పుడే చూశా. నటుడిగా అపారమైన అనుభవం ఉన్న ఆయన అలా మాట్లాడం బాధ కలిగించింది. దుస్తులు ధరించటమనేది వ్యక్తిగత అంశం. ఎవరికి నచ్చిన దుస్తులు వారు వేసుకుంటారు. ఒక్కోసారి వృత్తిపరంగానూ విభిన్న దుస్తులు ధరించాల్సి ఉంటుంది. సోషల్‌ మీడియా అనవసరమైన విషయాల్ని హైలెట్‌ చేస్తోంది. అదే మీడియా.. ఆ సీనియర్‌ నటుడు మద్యం సేవిస్తారని కానీ, చిరిగిన బట్టలు తొడుక్కుంటారని కానీ, ఆన్‌స్క్రీన్‌పై మహిళల్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తారనికానీ చెప్పకపోవడం ఆశ్చర్యపడాల్సిన విషయం! పెళ్లై పిల్లలున్న స్టార్‌హీరోలంతా హీరోయిన్లతో ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్ చేస్తుంటే దాని గురించి ఎవరూ ప్రశ్నించరెందుకు? చొక్కా లేకుండా తమ శరీరాన్ని చూపిస్తుంటే నోరు మెదపరెందుకు?’ అని ఘూటుగా సమాధానమిచ్చారు. ఆ నటుడు ఎవరో చెప్పకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని