Boomika: ఉత్కంఠగా ‘భూమిక’ ట్రైలర్‌

యువ నటి ఐశ్వర్య రాజేశ్‌ ప్రధాన పాత్రలో రూపొందిన హారర్‌ చిత్రం ‘భూమిక’. రతీంద్రన్‌ ఆర్‌. ప్రసాద్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 23నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

Published : 17 Aug 2021 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐశ్వర్య రాజేశ్‌ ప్రధాన పాత్రలో రూపొందిన హారర్‌ చిత్రం ‘భూమిక’. రతీంద్రన్‌ ఆర్‌.ప్రసాద్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 23నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌2ని విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్‌ 1లానే ఇది ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. దట్టమైన అడవి లొకేషన్‌, భూమి గురించి వివరించే సంభాషణతో ప్రారంభమవుతుంది ఈ ట్రైలర్‌. ఓ రోడ్డు ప్రమాదం, ఓ హత్య, ఛేజింగ్‌ సన్నివేశాలతో సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. ఐశ్వర్య రాజేశ్‌ నటన మెప్పిస్తుంది. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ప్రకృతి గొప్పతనాన్ని తెలియజేసే చిత్రమిది. స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై కార్తికేయన్‌ సంతానం, సుందరం, జయరామన్‌ నిర్మించారు. కార్తీక్‌ సుబ్బరాజు సమర్పిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని