TS News: యాదాద్రీశుడిని దర్శించుకున్న సినీదర్శకుడు రాఘవేంద్రరావు

 తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్పీఎఫ్‌ సిబ్బంది ఆయుధ పూజ నిర్వహించారు.

Updated : 15 Oct 2021 17:01 IST

యాదాద్రి:  తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్పీఎఫ్‌ సిబ్బంది ఆయుధ పూజ నిర్వహించారు. కొండ కింద వాహన పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు ఉదయం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు. దర్శనానంతరం నిర్మాణంలో ఉన్న ప్రధానాలయాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. ఈవో గీతారెడ్డి ఆలయ పునర్‌నిర్మాణ పనులను రాఘవేంద్రరావుకు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని