The Family Man 2: సమంత వెబ్ సిరీస్.. 10 విభాగాల్లో హవా
లాక్డౌన్ కారణంగా ఓటీటీకి ఆదరణ పెరిగింది. స్థానిక చిత్రాలతోపాటు జాతీయ, అంతర్జాతీయ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: లాక్డౌన్ కారణంగా ఓటీటీకి ఆదరణ పెరిగింది. స్థానిక చిత్రాలతోపాటు జాతీయ, అంతర్జాతీయ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకుంది. అందుకే దర్శకనిర్మాతలు, అగ్ర నటులు సైతం ఓటీటీ వేదికగా సందడి చేస్తున్నారు. వీరి కష్టాన్ని గుర్తిస్తూ.. ప్రతిభను ప్రోత్సహించే విధంగా ఫిల్మ్‌ఫేర్ గతేడాది నుంచి ఓటీటీ అవార్డ్స్ అందిస్తోంది. 2021గానూ ఈ అవార్డ్స్‌కి నామినేట్ అయిన సిరీస్‌ల జాబితాను ఫిల్మ్‌ఫేర్ ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు 2020 ఆగస్టు 1 నుంచి 2021 జులై 31 మధ్య విడుదలై, విశేష ప్రేక్షకాదరణ పొందిన వాటిని ఎంపిక చేసింది.
వీటిల్లో ప్రముఖ నటి సమంత కీలక పాత్ర పోషించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’.. 10 విభాగాల్లో నామినేట్ అయింది. బెస్ట్ సిరీస్, బెస్ట్ డైరెక్టర్ (రాజ్ అండ్ డీకే, సుపర్న్ ఎస్. వర్మ), బెస్ట్ యాక్టర్ - మేల్ (మనోజ్ బాజ్‌పాయ్), బెస్ట్ యాక్టర్ - ఫిమేల్ (సమంత), బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్- ఫిమేల్ (ఆశ్లేషా ఠాకూర్), బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ -మేల్ (షరిబ్ హష్మి), (సన్నీ హిందూజ), బెస్ట్ ఒరిజినల్ స్టోరీ (సుమన్ కుమార్, రాజ్ అండ్ డీకే), బెస్ట్ డైలాగ్స్ (సుపర్న్ ఎస్ వర్మ, సుమన్ కుమార్, రాజ్ అండ్ డీకే, మనోజ్ కలైవనన్), బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే (సుమన్ కుమార్, రాజ్ అండ్ డీకే, సుపర్న్ ఎస్. వర్మ) కేటగిరీల్లో ఈ సిరీస్ హవా కొనసాగించింది. ప్రేక్షకులు తమకు నచ్చిన సిరీస్‌కు ఓటు వేసేందుకు ఫిల్మ్‌ఫేర్ వెబ్సైట్ ద్వారా ఈనెల 24, యాప్ ద్వారా ఈనెల 28 వరకు అవకాశం ఉంది.
మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో 2019లో విడుదలైన ‘ఫ్యామిలీమ్యాన్ సీజన్ 1’ విశేషంగా అలరించింది. దానికి కొనసాగింపుగా రూపొందిన సీజన్ 2లో సమంత కీలక పాత్ర పోషించి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. డీ గ్లామర్ పాత్రలో కనిపించి నటిగా తనసత్తా ఏంటో మరోసారి నిరూపించారు. ఈ సిరీస్‌కి రాజ్ అండ్ డీకే, సుపర్న్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్‌తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్‌తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్‌లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్‌ఖాన్ ‘లాల్‌సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్‌గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్‌కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్‌సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్‌గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్‌కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు