Nithiin: ఈ రీమేక్ చేసేందుకు భయపడ్డా.. కానీ!
‘‘అందాధున్’ రీమేక్ చేసేందుకు ముందుగా భయపడ్డా’ అని తెలిపారు నటుడు నితిన్. ఈయన హీరోగా నటించిన చిత్రం ‘మాస్ట్రో’.
హైదరాబాద్: ‘‘అందాధున్’ రీమేక్ చేసేందుకు ముందుగా భయపడ్డా’ అని సినీ నటుడు నితిన్ అన్నారు. అతడు హీరోగా నటించిన చిత్రం ‘మాస్ట్రో’. హిందీలో ఘన విజయం అందుకున్న ‘అందాధున్’కి రీమేక్‌గా రూపొందింది. మేర్లపాక గాంధీ దర్శకుడు. నభా నటేశ్, తమన్నా, నరేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సెప్టెంబరు 17 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ + హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా చేద్దామనుకున్నప్పుడు కొంచెం భయమేసింది. ఈ సమయంలో మనకు ఇలాంటి చిత్రం అవసరమా? కమర్షియల్ సినిమాలు చేసుకుంటే సరిపోతుంది కదా అనిపించింది. కానీ, ఓ నటుడిగా రిస్క్ తీసుకోవాలని భావించి ఈ చిత్రాన్ని ఓకే చేశా. ఈ సినిమా కోసం దర్శకుడు మేర్లపాక గాంధీ చాలా కష్టపడ్డాడు. రీమేక్ చేయడమంటే అంత తేలికైన విషయం కాదు. మాతృకలోని ఆత్మని ఏమాత్రం మార్చకుండా, మన నేటివిటీకి తగ్గట్టు కామెడీని జతచేసి అద్భుతంగా రూపొందించాడు. మహతి స్వరసాగర్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి బలంగా నిలుస్తాయి. ఈ సినిమాని థియేటర్లలో చూస్తే ఆ మజానే వేరు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చింది. అగ్ర నాయికగా కొనసాగుతోన్న తమన్నా ఈ చిత్రంలో నటిస్తుందా, లేదా? అనుకున్నాం. కానీ, ఆమె ధైర్యం చేసి ముందుకొచ్చింది. పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. నా సహనటులు, సాంకేతిక బృంద సభ్యులు, నిర్మాతలకి థ్యాంక్స్. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు.
మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. ‘నితిన్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకునేవాడ్ని. తన డ్యాన్సు, కామెడీ టైమింగ్‌ని దృష్టిలో పెట్టుకుని మంచి కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ చేద్దామనుకున్నా. కానీ, అది సాధ్యపడలేదు. అనుకోకుండా ‘అందాధున్’ రీమేక్ పట్టాలెక్కింది. ఇలాంటి సినిమాని తెరకెక్కించడం చాలా ఆనందంగా ఉంది. నితిన్ ఇందులో కొత్తగా కనిపిస్తారు. ఈ సినిమాతో తమన్నా గొప్ప నటిగా మారుతుంది. ఇకపై ఆమెని ‘మిల్కీబ్యూటీ’ అని పిలవకుండా ‘గ్రేట్ ఆర్టిస్ట్’గా అభివర్ణిస్తే బాగుంటుంది. నభా నటేశ్ తన పాత్రకి న్యాయం చేసింది. శ్రీముఖి, మంగ్లీ, రచ్చ రవి, మహేశ్ తదితరులు తమ తమ పాత్రలతో అలరిస్తారు’ అని చెప్పారు.
తమన్నా మాట్లాడుతూ... ‘చాలా రోజుల తర్వాత సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి రావడం ఆనందంగా ఉంది. నాపై మీరు చూపించే అభిమానం వల్లే నేను ఇలాంటి కథల్ని ఎంపిక చేసుకోగలుగుతున్నా. నితిన్‌తో కలిసి ప్రేమకథలో నటిస్తానేమో అనుకునేదాన్ని. అనుకోకుండా ఇలాంటి వైవిధ్యభరిత సినిమా కోసం మేం కలిసి పనిచేశాం. నితిన్ అంధుడి పాత్రలో చాలా బాగా నటించాడు. ఈ సినిమాలో నాకు కీలక పాత్ర ఇచ్చిన దర్శకుడు మేర్లపాక గాంధీ, నిర్మాత సుధాకర్‌రెడ్డికి చాలా చాలా థ్యాంక్స్’ అని అన్నారు. ‘తొలిసారి రీమేక్‌లో నటించా. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాలో ఇప్పటివరకు చూడని నితిన్‌ని చూస్తారు’ అని నభా నటేశ్ తెలిపింది. ఈ కార్యక్రమంలో నరేశ్, మంగ్లీ, రచ్చరవి, మహేశ్, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే? -
శరవేగంగా ‘కన్నప్ప’.. ఆ పాత్ర షూటింగ్ పూర్తి
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్‌ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
కీర్తి సురేశ్‌తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
కీర్తి సురేశ్‌తో కలిసి నటించనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా గురించి సుహాస్ ఏమన్నారంటే? -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్‌పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు. -
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ప్రభాస్ ‘కల్కి’ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్‌లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్‌పై దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్‌వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్‌వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్‌గా కృత్రిమ మేధ!
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు