Mohan Babu: మోహన్‌బాబు ఇంటి హోమ్ టూర్.. ఫుల్ వీడియో!
‘మోహన్‌బాబు హోం టూర్’. ఇంటి ప్రత్యేకల్ని వివరించిన మంచు లక్ష్మి..
ఇంటర్నెట్ డెస్క్: నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత శిఖరాల్ని అధిరోహించారు మోహన్‌బాబు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఒకప్పుడు ఇంటి అద్దె చెల్లించలేని దుస్థితిని ఎదుర్కొన్న ఆయన.. ఇప్పుడు ఆరు ఇళ్లు నిర్మించుకోగలిగారు. వాటిల్లో ఇంద్రభవనాన్ని తలపించే ఓ ఇంటిని తన కూతురు, నటి లక్ష్మి అభిమానులకు చూపించారు. ‘మా నాన్న హోమ్ టూర్’ పేరిట ఆ ఇంటి ప్రత్యేకతల్ని పంచుకున్నారు. ఇటీవల ప్రోమోతో సందడి చేసిన ఆమె ఇప్పుడు ఫుల్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
మోహన్‌బాబు ప్రకృతిని ఎంత ప్రేమిస్తారో, స్నేహితులకు ఎంత విలువిస్తారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. కళ్లు చెదిరే ఈ భవనంలో జిమ్, స్విమ్మింగ్ పూల్, డ్యాన్స్ ఫ్లోర్, థియేటర్ (క్యూబ్) తదితర అధునాతన వసతులన్నీ ఉన్నాయి. ఇంటి చుట్టూ పలు రకాల మొక్కలు, ఇంటి గోడలపై మోహన్‌బాబు కుటుంబ సభ్యుల ఫొటోలు, ఆయన అందుకున్న అవార్డులు దర్శనమిస్తాయి. ఇంటి ఆవరణలో మోహన్‌బాబు ఎక్కడ ఏం చేస్తారో, ఒక్కో గది ప్రత్యేకతను లక్ష్మి వివరించారు.
‘ఇది నాన్నగారు కట్టించుకున్న ఆరో ఇల్లు. గోడ ఖాళీగా కనిపిస్తే చాలు అక్కడ ఆయన ఫొటోలు పెట్టేస్తారు. నాన్నకు చెట్లంటే బాగా ఇష్టం. అందుకే ప్రతి ఇంటి దగ్గరా మొక్కలు ఉండేలా చూస్తారు. నాకు ఇక్కడకు వస్తే ఏదో తెలియని ఆనందం. మా నాన్నగారిది మారుమూల గ్రామం మోదుగులపాలెం. స్వర్ణముఖి నదిని దాటి ఆ ఊరును చేరుకోవాలి. వర్షం వస్తే చాలా ఇబ్బంది పడాలి. ‘ఈ జీవితంలో నేను ఏదైనా సాధించాలి’ అనుకుని ఆయన అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. స్వయంకృషితో ఈ స్థాయికి ఎదిగారు. తన స్వగ్రామానికి ఎంతో సాయమందించారు. ఆయన జర్నీ తలచుకున్నప్పుడల్లా భావోద్వేగానికి గురవుతా. ఆయన కూతురిగా ఎంతో గర్విస్తున్నా. ఆయన నాకు మంచి జీవితం, విద్య, పేరు, ప్రఖ్యాతలందించారు. ఈ వీడియో చూసిన వారిలో ఒక్కరు ఇన్స్పైర్ అయినా చాలు. అదే నాకు ఆనందం. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మోహన్‌బాబు స్నేహితుడి గురించి కూడా లక్ష్మి చెప్పుకొచ్చారు. మధ్యమధ్యలో మోహన్‌బాబు ఎంట్రీ అలరించింది. కూతురు, మనవరాలితో ఆయన చేసిన అల్లరి వినోదం పంచింది.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. -
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. -
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పారు. -
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
మనిషి కోరికలకు అంతం ఉండదని అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ సరదాగా అన్నారు. -
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
ఓ బాలీవుడ్ చిత్రంలో నటించినందుకు తనకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయని నటి ఇలియానా అన్నారు. -
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్‌కు హీరోయిన్ ఘాటు రిప్లై
మలయాళీ నటి మాళవిక మోహనన్ ఓ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చారు. ఏం జరిగిందంటే? -
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
ఓ హాలీవుడ్ సినిమా చూశాక తాను వ్యాక్సింగ్ మానేశానని చెప్పారు తమన్నా. అదే చిత్రమంటే? -
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. సానుభూతి కోసం ఎదురుచూడొద్దని కోరారు. -
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Aamir Khan: ఆ సీన్లో నగ్నంగా నటించాను: ఆమిర్ ఖాన్
రెండేళ్ల నుంచి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఆమిర్ ఖాన్ చెప్పారు. -
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
‘పొలిమేర2’ చిత్రం అరుదైన ఘనత సాధించింది. దీంతో నెటిజన్లు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
బాలీవుడ్ స్టార్స్‌తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్స్ ఏర్పాటు చేసిన పార్టీలో ఎన్టీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. -
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
ముద్దు సన్నివేశాలకు నో చెప్పిన కారణంగా అవకాశాలు కోల్పోయినట్లు మృణాల్ ఠాకూర్ చెప్పారు.