Nayanthara: లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ఇంట సెలబ్రేషన్స్‌

అగ్రకథానాయిక, లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ఇంట సందడి వాతావరణం నెలకొంది. నయన్‌ వాళ్లమ్మ ఒమనా కురియన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఇంట వేడుకలు జరిగాయి. నిరాడంబరంగా జరిగిన...

Published : 15 Sep 2021 14:19 IST

చెన్నై: అగ్రకథానాయిక, లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ఇంట సందడి వాతావరణం నెలకొంది. నయన్‌ వాళ్లమ్మ ఒమనా కురియన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఇంట వేడుకలు జరిగాయి. నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకల్లో నయన్‌తోపాటు ఆమెకు కాబోయే భర్త విఘ్నేశ్‌ శివన్‌ సైతం పాల్గొన్నారు. మిసెస్ కురియన్‌తో కేక్‌ కటింగ్‌ చేయించి ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా విఘ్నేశ్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ‘బంగారంలాంటి మనస్సున్న మిసెస్‌ ఒమనా కురియన్‌ అమ్ముకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాగే ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

నయనతార-విఘ్నేశ్‌ శివన్‌ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. కుటుంబపెద్దల సమక్షంలో వీరిద్దరికి నిశ్చితార్థమైంది. ‘నేత్రికన్‌’ ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల నయన్‌ ఈ విషయాన్ని బయటపెట్టారు. ‘నేను రౌడీనే’ సినిమా షూట్‌లో నయన్‌కు దర్శకుడు విఘ్నేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని