PUSHPA: పుష్పరాజ్‌ వచ్చేస్తున్నాడు.. రిలీజ్‌ డేట్‌ చెప్పేశారు..!

ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. స్టైలిష్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది....

Published : 02 Oct 2021 09:20 IST

హైదరాబాద్‌: ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. స్టైలిష్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. కాగా, తాజాగా ‘పుష్ప’ రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 17న ‘పుష్ప’ ఫస్ట్‌ పార్ట్‌ను ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సిద్ధమవుతోన్న ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్‌ పాత్ర పోషిస్తున్నారు.

మునుపెన్నడూ లేనివిధంగా ఇందులో బన్నీ ఊరమాస్‌ గెటప్‌లో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా రష్మిక సందడి చేయనున్నారు. ఈ సినిమాలో ఆమె పుష్పరాజ్‌ ప్రేయసి శ్రీవల్లిగా డీ గ్లామర్‌ రోల్‌లో కనిపించనున్నారు. దేవిశ్రీ స్వరాలు అందిస్తున్నారు. దేవిశ్రీ-సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ సినిమా ఇది. ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడు. మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని