Shilpa Shetty: రాజ్‌.. మన జీవితాల్లో మరిన్ని సంతోషాలు రావాలి: శిల్పాశెట్టి

రాజ్‌కుంద్రాపై తనకున్న ప్రేమను బయటపెట్టారు నటి శిల్పాశెట్టి. కష్టసుఖాలు ఎన్ని ఎదురైనా కలిసే ఉండాలని 12 సంవత్సరాల క్రితమే మాట ఇచ్చిపుచ్చుకున్నామని ఆమె తెలిపారు....

Published : 22 Nov 2021 14:43 IST

ముంబయి: రాజ్‌కుంద్రాపై తనకున్న ప్రేమను మరోసారి బయటపెట్టారు నటి శిల్పాశెట్టి. కష్టసుఖాలు ఎన్ని ఎదురైనా కలిసే ఉండాలని 12 ఏళ్ల కిందటే మాట ఇచ్చిపుచ్చుకున్నామని ఆమె తెలిపారు. నవంబర్‌ 21న తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పెళ్లినాటి ఫొటోలు షేర్‌ చేసిన శిల్పా.. ‘‘12 సంవత్సరాల క్రితం వివాహ బంధంతో మేము ఒక్కటయ్యాం. కష్టాలు ధైర్యంగా ఎదుర్కొంటూ.. ఆనందాలు సరదాగా పంచుకుంటూ.. ఒకరికొకరం తోడుగా ప్రేమతో ప్రయాణాన్ని సాగించాలని ఆనాడు చేసిన పెళ్లి ప్రమాణాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు రాజ్‌!! మన జీవితంలో మరెన్నో హరివిల్లులు విరియాలని.. సంతోషాలు రావాలని కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చారు.

సోషల్‌మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉండే శిల్పాశెట్టి గతంలో తరచూ తన భర్త రాజ్‌కుంద్రాతో కలిసి ఫన్నీ వీడియోలు క్రియేట్‌ చేసి నెట్టింట్లో షేర్‌ చేస్తుండేది. అశ్లీల చిత్రాలు నిర్మిస్తున్నారనే కేసులో ఇటీవల రాజ్‌ జైలుకెళ్లి వచ్చినప్పటి నుంచి తన భర్తకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను శిల్పా చాలా అరుదుగా షేర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని