Social look: ఫ్లైట్‌ మిస్‌ అయిన తమన్నా.. అల్లు అర్జున్‌ స్టైలిష్‌ లుక్‌

‘నేను ఎక్కాల్సిన ఫ్లైట్‌ మిస్‌ అవడానికి కారణం ఇదే’ అంటూ నూడిల్స్‌ ఫొటోని చూపించింది తమన్నా భాటియా. ఈ పసందైన ఆహారాన్ని ఆరగిస్తుండటంతో తను ప్రయాణించాల్సిన ..

Published : 26 Jul 2021 01:57 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

 ‘నేను ఎక్కాల్సిన ఫ్లైట్‌ మిస్‌ అవడానికి కారణం ఇదే’ అంటూ నూడిల్స్‌ ఫొటోని చూపించింది తమన్నా భాటియా. ఈ పసందైన ఆహారాన్ని ఆరగిస్తుండటంతో తను ప్రయాణించాల్సిన విమానాన్ని అందుకోలేకపోయిందట.

కథానాయకుడు అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన కొత్త ఫొటోని పంచుకున్నారు. పొడవాటి జుత్తు, గెడ్డంతో.. నల్ల కళ్లద్దాలు పెట్టుకుని స్టైలిష్‌ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ‘పుష్ప’ సినిమాలో ఇదే గెటప్‌లో కనిపించనున్నారు.

‘సండే మూడ్‌’ అంటూ కుర్రకారుని హీటెక్కించే ఫొటోని పంచుకుంది ప్రగ్యాజైస్వాల్‌.

నారా రోహిత్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు శ్రీ విష్ణు. 

తన ముద్దుల తనయ అర్హ ఆడిన ఆటని వీడియోలో బంధించి, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు అల్లు అర్జున్‌ సతీమణి స్నేహ.

 యోగా చేస్తూ కనిపించింది నాయిక అంజలి. ‘చిత్రీకరణలో మరో రోజు’ అంటూ కొత్త ఫొటోల్ని షేర్‌ చేసింది మెహరీన్‌.






























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని