సునీల్‌-ధన్‌రాజ్‌ కాంబినేషన్‌.. ఆసక్తి పెంచుతోన్న టైటిల్‌

సునీల్‌, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ అంజి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టైటిల్‌ పోస్టర్‌ని ఆదివారం విడుదల చేసింది చిత్ర బృందం.

Published : 01 Aug 2021 13:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సునీల్‌, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ అంజి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టైటిల్‌ పోస్టర్‌ని ఆదివారం విడుదల చేసింది చిత్ర బృందం. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘బుజ్జీ ఇలారా’ అనే ఆసక్తికర పేరుని ఖరారు చేశారు. ఈ సినిమాలో చాందిని తమిళరసన్‌ నాయికగా నటిస్తుంది. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సత్యకృష్ణ, వేణు, భూపాల్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి ఈ చిత్రానికి కథ, స్క్కీన్‌ ప్లే అందిస్తున్నారు. జి. నాగేశ్వర రెడ్డి టీమ్‌ వర్క్స్‌, ఎస్‌.ఎన్‌.ఎస్‌. క్రియేషన్స్‌ ఎల్‌.ఎల్‌.పి. సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతం: సాయి కార్తీక్‌, ఛాయాగ్రహణం: అంజి, మాటలు: భాను, నాయుడు, కూర్పు: చోటా కె. ప్రసాద్‌, కళ: చిన్నా. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని