Vaishnav Tej: వైష్ణవ్‌ వస్తున్నాడు..

వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Updated : 03 Jan 2023 12:25 IST

వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej), శ్రీలీల (Sreeleela) జంటగా శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన ఓ కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అందులో తీగల కంచె అవతల అస్పష్టంగా కనిపిస్తూ వైష్ణవ్‌ నిల్చున్న తీరు.. మరోవైపు కంచె తగలబడుతున్న వైనం ఆసక్తిరేకెత్తించేలా ఉన్నాయి. ‘‘పూర్తి స్థాయి మాస్‌ యాక్షన్‌ చిత్రమిది. ఇందులో వైష్ణవ్‌ తేజ్‌ సరికొత్త మాస్‌ లుక్‌తో కనిపించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: డుడ్లే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని