Vishwak Sen: రిస్క్ చేసి ఆడిన ఆట ఇది
‘‘కామెడీ నా బలం కాదు. యాక్షన్.. డార్క్ డ్రామా.. ఇంటెన్స్ ఎమోషన్స్‌ను బాగా డైరెక్ట్ చేస్తా. కానీ, ‘దాస్ కా ధమ్కీ’తో నేను కామెడీ కూడా బాగా తీయగలననే నమ్మకాన్ని ప్రేక్షకులు నాకిచ్చారు’’ అన్నారు విష్వక్ సేన్.
‘‘కామెడీ నా బలం కాదు. యాక్షన్.. డార్క్ డ్రామా.. ఇంటెన్స్ ఎమోషన్స్‌ను బాగా డైరెక్ట్ చేస్తా. కానీ, ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki)తో నేను కామెడీ కూడా బాగా తీయగలననే నమ్మకాన్ని ప్రేక్షకులు నాకిచ్చారు’’ అన్నారు విష్వక్ సేన్ (Vishwak Sen). ఆయన హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రమే ‘దాస్ కా ధమ్కీ’. కరాటే రాజు నిర్మాత. నివేదా పేతురాజ్ కథానాయిక. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు విష్వక్ సేన్.
* ‘‘ఇది సేఫ్ బిజినెస్ చేసి విడుదల చేసిన సినిమా కాదు. రిస్క్ చేసి ఆడిన ఆట. కాబట్టి చాలా మజాగా ఉంది. కథపై ఉన్న నమ్మకంతోనే హీరోగా చేస్తూ.. స్వీయ దర్శకత్వంలో నిర్మించా. ఇది ఒత్తిడితో కూడిన వ్యవహారమే అయినా సినిమా తీస్తున్నప్పుడు కష్టపడినట్లు అనిపించలేదు. నా తొలి సినిమా ‘ఫలక్‌నుమా దాస్’ కన్నా పదింతలు దీనిపై ఖర్చు పెట్టాం. ఇప్పుడు మేము అనుకున్న దానికన్నా పెద్ద విజయం సాధించింది ఈ చిత్రం. నా కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. చాలా ఆనందంగా ఉంది’’.
* ‘‘ఈ కథను ప్రసన్న కుమార్ దగ్గర్నుంచి కొన్నాను. తను దీన్ని కామెడీ ఎంటర్‌టైనర్‌లా రాసుకున్నాడు. ఆ తర్వాత దీన్ని నేను రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా మార్చాను. ఈ కథ రాసుకుంటున్నప్పుడు ఇందులో నా రెండో పాత్ర బ్యాక్ స్టోరీని రాసుకున్నాను. ఆ ప్రపంచం చాలా ఆసక్తికరంగా అనిపించింది. దాన్ని రెండో భాగంలో చూపించనున్నా’’.
* ‘‘ప్రస్తుతం నేను సితార నాగవంశీతో, రామ్ తాళ్లూరితో సినిమాలు చేస్తున్నా. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక నా సొంత నిర్మాణ సంస్థలో ఓ చిత్రం చేస్తా. అలాగే ‘ఫలక్‌నుమా దాస్2’, ‘ధమ్కీ2’ సినిమాలు చేస్తా. మరో రెండు నెలల్లో నా ‘గామి’ చిత్రం విడుదల కానుంది’’.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Gang rape: విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్.. కాలిన గాయాలతో మృతి
-
Sports News
Virat Kohli: కోహ్లీ అందరికన్నా ముందొచ్చి..
-
Politics News
సమస్యలు అడిగితే చెప్పుతో కొడతా.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
World News
‘బ్లూటూత్’తో మెదడు, వెన్నెముకల అనుసంధానం!.. నడుస్తున్న పక్షవాత బాధితుడు
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!