Kannappa: కన్నప్ప కోసం మోహన్‌లాల్‌?

పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘కన్నప్ప’ కోసం పలువురు అగ్ర నటులు రంగంలోకి దిగుతున్నారు.

Updated : 01 Oct 2023 13:53 IST

పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘కన్నప్ప’ కోసం పలువురు అగ్ర నటులు రంగంలోకి దిగుతున్నారు. మంచు విష్ణు టైటిల్‌ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌, నయనతార కీలక పాత్రలు పోషించనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆ జాబితాలోకి మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్‌ చేరారు. ఇందులోని ఓ కీలక పాత్రలో ఆయన నటించనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఇటీవలే మోహన్‌లాల్‌, మంచు విష్ణు కలిసి చర్చలు జరిపారు. శివభక్తుడి కథతో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ న్యూజిలాండ్‌లో మొదలైన సంగతి తెలిసిందే. మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న చిత్రమిది.


‘లూసిఫర్‌ 2’కి ముహూర్తం

మోహన్‌లాల్‌ కథానాయకుడిగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘లూసిఫర్‌’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి కొనసాగింపుగా అదే బృందం ‘లూసిఫర్‌ 2’ తెరకెక్కించనుంది. ఈ సినిమాతో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ మలయాళంలోకి అడుగు పెడుతోంది. అక్టోబరు 5 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తున్నట్టు సినీ వర్గాలు శనివారం స్పష్టం చేశాయి. ‘లూసిఫర్‌’ తెలుగులో ‘గాడ్‌ఫాదర్‌’గా రీమేక్‌ అయిన విషయం తెలిసిందే.

  •  ‘ఎల్‌2ఈ: ఎంపురాన్‌’ పేరుతో మలయాళంతోపాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రవర్గాలు తెలిపాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని