దేశంలో భాజపా ఆధిపత్యం తగ్గింది 

గత సంవత్సరం జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం దేశంలో భాజపా ఆధిపత్యం తగ్గిందని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం శుక్రవారం ట్వీట్‌ చేశారు.  ఈ మధ్య జరిగిన బిహార్‌ ఎన్నికల్లో కూడా కమలం పార్టీ పనితీరు తగ్గినట్లుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ‘2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 392 స్థానాలు గెలిచి కేంద్రంలో స్వతంత్రంగా అధికారం చేపట్టింది..

Published : 21 Nov 2020 01:45 IST

 కేంద్ర మాజీ మంత్రి ట్వీట్‌


న్యూ దిల్లీ:  గత సంవత్సరం జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం దేశంలో భాజపా ఆధిపత్యం తగ్గిందని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం శుక్రవారం ట్వీట్‌ చేశారు. ఈ మధ్య జరిగిన బిహార్‌ ఎన్నికల్లో కూడా కమలం పార్టీ పనితీరు తగ్గినట్లుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ‘2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 392 స్థానాలు గెలిచి కేంద్రంలో స్వతంత్రంగా అధికారం చేపట్టింది. కానీ  బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ మొత్తం 125 స్థానాలు కైవసం చేసుకుంది. అందులో భాజపా 74 స్థానాలు మాత్రమే గెలుచుకుంది’అని ఈ సందర్భంగా చిదంబరం ట్వీట్‌ చేశారు. బిహార్‌ ఎన్నికల ఫలితాల్లో  జేడీయూ 43, ఇతర ఎన్డీఏ కూటమి పార్టీలు 8 సీట్లలో జయకేతనం ఎగురవేశాయి. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ 75 స్థానాల్లో విజయం సాధించి ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్‌ 70 స్థానాల్లో పోటీ చేసి కేవలం 19 సీట్లకే పరిమితమయింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని