ఉచిత టీకా హామీ ఉల్లంఘనేమీ కాదు: ఈసీ

బిహార్‌లో భాజపా ఇచ్చిన ఉచిత వ్యాక్సిన్‌ హామీ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. సమాచార హక్కు కార్యకర్త సాకేత్‌ గోఖలే కోరిన సమాచారం మేరకు ఈసీ స్పందిస్తూ ఈ సమాధానం ఇచ్చింది...........

Updated : 31 Oct 2020 15:03 IST

దిల్లీ: బిహార్‌లో భాజపా ఇచ్చిన ఉచిత వ్యాక్సిన్‌ హామీ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. సమాచార హక్కు కార్యకర్త సాకేత్‌ గోఖలే కోరిన సమాచారం మేరకు ఈసీ స్పందిస్తూ ఈ సమాధానం ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన విషయంలో పార్ట్‌-VIIIలో పొందుపర్చిన ఏ నిబంధననూ ఉచిత టీకా హామీ ఉల్లంఘించడం లేదని ఈసీ వివరించింది. ఆదేశిక సూత్రాల ఆధారంగా ప్రజల సంక్షేమం కోసం పార్టీలు ఎలాంటి సమంజసమైన హామీలనైనా మేనిఫెస్టోలో చేర్చవచ్చని గుర్తుచేసింది. 

భాజపా ఇచ్చిన ఉచిత టీకా హామీ వివక్షాపూరితంగా ఉందని.. కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందంటూ గోఖలే ఆరోపించారు. దీనిపై ఈసీ తాజాగా ఇచ్చిన సమాధానంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. భాజపా కేవలం ఒక్క రాష్ట్రానికే ఈ హామీ ఇచ్చిందన్న విషయాన్ని ఈసీ విస్మరించిందని ఆరోపించారు. 

బిహార్‌లో అధికారంలోకి వస్తే కరోనా వైరస్‌ టీకా ఉచితంగా అందజేస్తామని ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ కేంద్ర మంత్రి, భాజపా సీనియర్‌ నాయకురాలు నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఒక్క బిహార్‌కే వ్యాక్సిన్‌ అందజేస్తే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కేంద్ర వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని