‘మోదీ వల్లభారత్‌ ఎదుర్కొంటున్న విపత్తులివే’

మోదీ ప్రభుత్వ విధానాలను తరచూ విమర్శిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తాజాగా వాటిలో పదును పెంచారు. చైనాతో ఘర్షణలు, కుంగిన వృద్ధిరేటు, పెరిగిన నిరుద్యోగిత వంటి అంశాల్ని ప్రస్తావిస్తూ భాజపా ప్రభుత్వంపై విరచుకుపడ్డారు...........

Published : 02 Sep 2020 15:20 IST

భాజపా సర్కార్‌పై రాహుల్‌ గాంధీ విమర్శలు

దిల్లీ: మోదీ ప్రభుత్వ విధానాలను తరచూ విమర్శిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తాజాగా వాటిలో పదును పెంచారు. చైనాతో ఘర్షణలు, కుంగిన వృద్ధిరేటు, పెరిగిన నిరుద్యోగిత వంటి అంశాల్ని ప్రస్తావిస్తూ భాజపా ప్రభుత్వంపై విరచుకుపడ్డారు. ‘మోదీ వల్ల సంభవించిన ఈ విపత్తుల్లో భారత్‌ చిక్కుకుంది’ అంటూ ఐదు అంశాల్ని ప్రస్తావించారు. వృద్ధి రేటులో కుంగుబాటు, 45 ఏళ్ల గరిష్ఠానికి చేరిన నిరుద్యోగిత, 12 కోట్ల ఉద్యోగాల కోత, రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ ఆదాయాన్ని నిలిపివేయడం, కరోనాతో ప్రపంచంలోనే అత్యధిక మంది మరణించడం, సరిహద్దుల్లో పొరుగు దేశాల అతిక్రమణ వంటివి మోదీ వల్ల సంభవించిన విపత్తులంటూ రాహుల్‌ విమర్శించారు. 

కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో భారత వృద్ధి రేటు ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 23.9 శాతం కుంగిన విషయం తెలిసిందే. మోదీ ప్రభుత్వ విధానాలపై తరచూ విమర్శలు గుప్పిస్తున్న రాహుల్‌ దేశ ఆర్థిక పరిస్థితే లక్ష్యంగా చేసుకున్నారు. నోట్ల రద్దుతో ప్రారంభమైన ఆర్థిక వ్యవస్థ పతనం మోదీ తప్పుడు నిర్ణయాలతో మరింత తీవ్రమవుతోందని ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని