‘విశాఖ భూములపై సిట్‌ నివేదిక సిద్ధం’

ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించినా కఠిన చర్యలు తప్పవని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అని.. ప్రజాస్వామ్యంలో ..

Published : 21 Dec 2020 01:19 IST

విశాఖ: ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించినా కఠిన చర్యలు తప్పవని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అని.. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమేనన్నారు. ఈ విషయంలో తెదేపా నేతలు తప్పుడు ప్రచారాలు చేయవద్దన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విశాఖ జిల్లాలో బాక్సైట్‌ తవ్వకాలను అనుమతించబోమని స్పష్టం చేశారు.

ఒడిశా నుంచి బాక్సైట్‌ తెచ్చి అన్‌రాక్‌ పరిశ్రమ నడిపే యోచనలో ఉన్నామని.. దీని వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. విశాఖ భూములపై సిట్‌ నివేదిక సిద్ధమైందని.. త్వరలోనే అధికారులు ప్రభుత్వానికి అందజేస్తారని చెప్పారు. పరిపాలన రాజధాని విశాఖలో ప్రభుత్వ భూమిలోనే కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని విజయసాయిరెడ్డి వివరించారు. 

ఇవీ చదవండి..

విశాఖలో తెదేపా ఎమ్మెల్యే భూమి స్వాధీనం

దివీస్‌పై ప్రభుత్వం మోసం చేస్తోంది: యనమల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని