బిహార్‌లో ప్రచారానికి ‘సేనా’ సైన్యం

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారంతో హోరెత్తించడానికి శివసేన సిద్ధం అవుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే స్వయంగా తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ తరపున

Published : 08 Oct 2020 21:57 IST

ముంబయి: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారాన్ని హోరెత్తించడానికి శివసేన సిద్ధం అవుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే స్వయంగా తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ తరపున ప్రచారం చేయనున్న 22 మంది నేతల పేర్లతో కూడిన జాబితాను శివసేన గురువారం విడుదల చేసింది. ఉద్ధవ్‌ ఠాక్రేతో పాటు ఆయన కుమారుడు, మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే సైతం ప్రచారంలో పాల్గొననున్నారు. సుభాష్‌ దేశాయ్‌, సంజయ్‌రౌత్‌, అనిల్‌ దేశాయ్‌, వినాయక్‌ రౌత్‌, అరవింద్‌ సావంత్‌, పియాంక చతుర్వేది, రాహుల్‌ షెవాలే, కృపాల్‌ తుమనేలూ ప్రచార కర్తల జాబితాలో ఉన్నారు. గత ఏడాది భాజపాతో విడిపోయిన సేన, బిహార్‌లో దాదాపు 50 స్థానాలలో పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు మూడు దశలలో నిర్వహించనున్నారు. మొదటి దశ అక్టోబరు 28న, రెండోదశ నవంబరు 3న, ఇక చివరిదైన మూడోదశ నవంబరు 7న ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని