AAP: కాంగ్రెస్‌ ముక్కలుగా మిగిలిపోనుంది..ఆప్‌ వ్యంగ్యాస్త్రాలు..!

ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది భాజపాలో చేరడంతో బుధవారం గోవాలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Published : 15 Sep 2022 02:07 IST

దిల్లీ: ‘దిల్లీ, పంజాబ్‌లో ఆపరేషన్ లోటస్‌ బెడిసికొట్టింది. కానీ గోవాలో విజయవంతమైంది. కారణమేంటంటే.. ఇప్పుడు మీరు కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. వారు తర్వాతి రోజుల్లో భాజపా ఎమ్మెల్యేగా మారిపోతారు. కాంగ్రెస్ పని అయిపోయింది. ఆ పార్టీ ముక్కలుగా మిగిలిపోనుంది(resting in pieces)’ అని ఆప్‌ నేత రాఘవ చద్దా ట్వీట్ చేశారు.

గోవాలోని కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది భాజపాలో చేరడంతో బుధవారం గోవాలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీనిపై హస్తం పార్టీని ఎద్దేవా చేస్తూ.. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ట్విటర్ వేదికగా స్పందించింది. అలాగే భాజపా వ్యవహరిస్తోన్న తీరును దుయ్యబట్టింది. 

 ఇదిలా ఉంటే.. పంజాబ్‌లో భగవంత్ మాన్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఆప్‌ సర్కార్‌ను కూల్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆ పార్టీ నేతలు నిన్న ఆరోపణలు చేశారు. దాదాపు 10 మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల చొప్పున భాజపా నేతలు ఆఫర్ చేసినట్లు పంజాబ్ ఆర్థిక మంత్రి హర్‌పాల్ సింగ్ చీమా వ్యాఖ్యలు చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్  అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. భాజపా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, ప్రభుత్వాలను కూల్చివేస్తోందని దుయ్యబట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని