Ajit Pawar: అందుకోసమే భాజపా-శివసేన ప్రభుత్వంలో చేరా: అజిత్‌ పవార్‌

ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి అందులో భాగస్వామ్యం కావాలని భాజపా-శివసేన ప్రభుత్వంలో చేరినట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ (Ajit Pwar) తెలిపారు. 

Published : 28 Aug 2023 13:13 IST

ముంబయి: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ (Ajit Pwar) అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే శివసేన (ఏక్‌నాథ్‌ శిందే వర్గం)- భాజపా ప్రభుత్వంలో చేరినట్లు తెలిపారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా బారామతి నియోజకవర్గంలో పర్యటించిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. 

‘‘ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు, రాష్ట్రాభివృద్ధి కోసమే భాజపా-శివసేన ప్రభుత్వంలో చేరాను. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. దేశాభివృద్ధి కోసం ప్రధాని మోదీ ఎంతో కష్టపడుతున్నారు. గతంలో నేను ఆయన్ను విమర్శించాను. కానీ, ప్రధాని చేస్తున్న అభివృద్ధి పనులు చూసి అందులో భాగస్వామ్యం కావాలని భాజపా-శివసేన ప్రభుత్వంలో చేరాను. 2004లో కూడా ఎన్సీపీ అభ్యర్థికి సీఎం అయ్యే అవకాశం లభించింది. కానీ, ఎన్సీపీ ఆ పదవిని కోరుకోలేదు’’ అని అజిత్‌ పవార్‌ తెలిపారు. 

నూహ్‌లో మళ్లీ టెన్షన్‌ టెన్షన్‌.. సరిహద్దులు మూసేసిన పోలీసులు

ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) మాట్లాడుతూ.. తమ పార్టీలో ఎలాంటి చీలిక లేదని వ్యాఖ్యానించారు. మెజార్టీ సభ్యులేమీ బయటకు వెళ్లిపోలేదని, కేవలం కొందరు వ్యక్తులు భిన్నమైన వైఖరి తీసుకున్నారని,  ఇదేం చీలిక కాదని అన్నారు. మరోవైపు అజిత్ భాజపా-శివసేన ప్రభుత్వంలో చేరినప్పటికీ.. ఆయన తన బాబాయ్‌తో వరుసగా సమావేశం అవుతున్నారు. దీంతో శరద్‌పవార్‌ భాజపాతో జట్టు కడతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, వాటిని శరద్ పవార్ కొట్టిపారేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని