Amit Shah: తెలంగాణలో రాజకీయాలు కలుషితమయ్యాయి: అమిత్‌ షా

తెలంగాణలో రాజకీయాలు కలుషితమయ్యాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

Updated : 26 Nov 2023 18:51 IST

భువనగిరి: తెలంగాణలో రాజకీయాలు కలుషిత మయ్యాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరిలో ఏర్పాటు చేసిన సకలజనుల విజయ సంకల్ప సభలో అమిత్‌ షా పాల్గొని ప్రసంగించారు.

‘‘భువనగిరి ఖిల్లాను కేసీఆర్‌ అభివృద్ధి చేయలేదు.. మేము అభివృద్ధి చేస్తాం. మూసీ నదిని శుద్ధి చేస్తాం. పోచంపల్లి గ్రామంలో వినోబాబావే భూదాన ఉద్యమం చేస్తే.. కేసీఆర్‌ భూములను కబ్జా చేస్తున్నారు. భారాసకు వీఆర్‌ఎస్‌ ఇచ్చే సమయం ఆసన్నమైంది. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే విషయమై ప్రధాని మోదీని కేసీఆర్‌ ఎప్పుడూ కలవలేదు. మిషన్‌ భగరీథలో, కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణం చేశారు. 2014, 2018లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు భారాసలోకి వెళ్లారు. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని భాజపా వాగ్దానం చేసింది. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. తెలంగాణలో అధికారమిస్తే పెట్రోల్‌, డీజిల్‌ చౌకగా అందిస్తాం. అయోధ్యలో 2019లో భూమి పూజ చేశాం, 2024లో రామమందిరం, రాముడికి ప్రాణప్రతిష్ఠ చేస్తాం’’ అని అమిత్ షా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని