వర్గపోరుతో నష్టపోయాం.. తెలంగాణ భాజపా నేతలకు అమిత్‌ షా వార్నింగ్‌

వర్గ విభేదాల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామని తెలంగాణ భాజపా ముఖ్య నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వార్నింగ్‌ ఇచ్చారు.

Updated : 28 Dec 2023 20:33 IST

హైదరాబాద్‌: వర్గ విభేదాల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామని తెలంగాణ భాజపా ముఖ్య నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వార్నింగ్‌ ఇచ్చారు. విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని ఆదేశించారు. గురువారం రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన అమిత్‌ షా హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయన్నారు. ‘‘30 సీట్లు వస్తాయని ఆశించాం.. కానీ, అనుకున్నన్ని సీట్లు సాధించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలి. సిట్టింగ్‌ ఎంపీలకే మరోసారి అవకాశం కల్పిస్తాం. మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా అవకాశం ఇస్తాం. ఈసారి అభ్యర్థులను త్వరగా ప్రకటిస్తాం’’ అని అమిత్‌ షా తెలిపారు. అంతకుముందు శంషాబాద్‌ విమానాశ్రయంలో అమిత్ షాకు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌ స్వాగతం పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని