అక్రమ కేసులు ఎత్తేయాలి: అచ్చెన్నాయుడు

ఎన్నికలయ్యాక కూడా కావాలనే తెదేపా నేతలపై వైకాపా కక్ష సాధింపులకు దిగుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ..

Updated : 12 Mar 2021 10:25 IST

అమరావతి: ఎన్నికలయ్యాక కూడా కావాలనే తెదేపా నేతలపై వైకాపా కక్ష సాధింపులకు దిగుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. కదిరిలో ఎమ్మెల్యే సిద్దారెడ్డి ప్రోద్బలంతో తెదేపా ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌పై, గుంటూరు 42వ డివిజన్‌ తెదేపా అభ్యర్థి బుజ్జిపై హత్యాయత్నం కేసుతో పాటు, డివిజన్‌ అధ్యక్షుడు ఉదయ్‌, రాష్ట్ర కార్యదర్శి కనపర్తిపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు.

 రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయక పోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. వైకాపా పాల్పడిన ఒక్క అక్రమం కూడా పోలీసులకు కనిపించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డీజీపీ, ఎస్‌ఈసీ ఏం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. తెదేపాకు మద్దతుగా ఉన్నారన్న కుట్రతో పచ్చని పొలాలను తగులబెట్టి ఆర్థికంగా చిదిమేస్తున్నారని ఆక్షేపించారు.  తెదేపా అడ్డుకుంది పోలీసుల విధులను కాదని, వైకాపా రిగ్గింగ్‌నని తెలిపారు. దొంగల పార్టీకి అక్రమ కేసులు పెట్టడం అలవాటైందని ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని