పాతబస్తీలో పన్నులు ఎందుకు కట్టరు?: బండి

పాతబస్తీలో హిందువులు భయానక వాతావరణంలో జీవిస్తున్నారని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు...

Updated : 30 Sep 2022 15:16 IST

హైదరాబాద్‌: పాతబస్తీలో హిందువులు భయానక వాతావరణంలో జీవిస్తున్నారని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పాతబస్తీని భాగ్యనగరంగా మార్చాలని భాజపా కోరుకుంటోందని స్పష్టం చేశారు. బేగంపేటలో వైద్యులతో బండి సంజయ్‌ సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాతబస్తీలో హిందూ జనాభాను తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. భాజపా గెలిస్తే రోహింగ్యాలు, పాక్‌ వాసులను తరిమికొడతామన్నారు. పాతబస్తీలో అభివృద్ధి ఎందుకు జరగట్లేదని ప్రశ్నించారు.‘‘ పాతబస్తీలో ఏడాదికి రూ.600 కోట్లు విద్యుత్‌ బిల్లులు చెల్లించడం లేదు. ఆస్తి పన్ను, నల్లా బిల్లులు చెల్లించడం లేదు. పన్నులన్నీ హిందువులు కడితే పాతబస్తీలో జల్సా చేస్తారా?’’ అని ప్రశ్నించారు. గ్రేటర్‌లో భాజపాకు అవకాశం ఇవ్వాలని వైద్యులను కోరారు. ఎన్నో మహానగరాలను భాజపా అభివృద్ధి చేసిందని, హైదరాబాద్‌ను కూడా మహానగరంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని