Politics: దేశవ్యాప్తంగా భాజపా రాజకీయ బలం తగ్గుతోంది: శరద్‌ పవార్‌

 దేశవ్యాప్తంగా అనేక చోట్ల భాజపా రాజకీయ బలం తగ్గుతోందని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) పేర్కొన్నారు.

Published : 15 Oct 2023 22:25 IST

ముంబయి: దేశంలో అనేక ప్రాంతాల్లో భాజపా రాజకీయ బలం క్షీణిస్తోందని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) అన్నారు.  కేవలం కొన్ని రాష్ట్రాల్లోనే అధికారంలో ఉందన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఎన్సీపీ ఆఫీస్‌ బేరర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన.. భాజపాతో కలిసి కూటమిగా ఏర్పడాలనే పార్టీలకూ ప్రజలు మద్దతుగా నిలవడం లేదని తెలిపారు.

‘భాజపాతో పొత్తు పెట్టుకోవాలనుకునే పార్టీలతో దేశ ప్రజలు మద్దతుగా నిలవడంలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఇది. ఓసారి దేశ మ్యాప్‌ను పరిశీలిస్తే.. దక్షిణాదిలో ఒక్క రాష్ట్రంలోనూ భాజపా అధికారంలో లేదు. మహారాష్ట్రలోనూ శివసేనను చీల్చి భాజపా అధికారంలోకి వచ్చింది. గోవాతోపాటు 2020 వరకు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లోనూ ఇటువంటి ఫార్ములానే కాషాయ పార్టీ అమలు చేసింది. కేవలం గుజరాత్‌లో మాత్రమే భాజపా అధికారంలో ఉంది’ అని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు.

Chandrayaan 3: మన టెక్నాలజీని అమెరికా అడిగింది: ఇస్రో చీఫ్‌

‘రాజస్థాన్‌, పంజాబ్‌, దిల్లీ, హిమాచల్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో భాజపా అధికారంలో లేదు. ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు మరో రెండు, మూడు రాష్ట్రాల్లో తప్ప దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భాజపా ప్రాభవం తగ్గుతోంది. ఎన్నికల తర్వాత ఈ విషయం మరింత స్పష్టంగా తెలుస్తుంది. ఇలా భాజపా బలం క్షీణించడానికి వారి అధికార దుర్వినియోగమే కారణం. సామాన్యుడి సాధికారత దిశగా  ఆ పార్టీ నిర్ణయాలు తీసుకోవడం లేదు’ అని శరద్‌ పవార్‌ విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని