ఆ ఎంపీ చనిపోలేదు: ఆస్పత్రి వర్గాలు

కర్ణాటక భాజపా ఎంపీ అశోక్‌ గస్తీ (55) ఆరోగ్య పరిస్థితిపై గందరగోళం నెలకొంది. 15 రోజుల క్రితం కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆయన గురువారం సాయంత్రం కన్నుమూశారంటూ............

Updated : 23 Nov 2022 11:44 IST

అశోక్‌ గస్తీకి చికిత్స కొనసాగుతోందన్న వైద్యులు

బెంగళూరు: కర్ణాటక భాజపా ఎంపీ అశోక్‌ గస్తీ (55) ఆరోగ్య పరిస్థితిపై గందరగోళం నెలకొంది. 15 రోజుల క్రితం కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆయన గురువారం సాయంత్రం కన్నుమూశారంటూ పెద్ద ఎత్తున వచ్చిన వార్తలపై ఆస్పత్రి వర్గాలు స్పందించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వైద్య చికిత్స అందిస్తున్నట్టు స్పష్టం చేశాయి. భాజపా నేతగా ఉన్న అశోక్‌ గస్తీ ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు. అయితే, ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన మరణించారంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అనేకమంది రాజకీయ ప్రముఖులు ట్విటర్‌లో సంతాపాలు కూడా వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఆయన చికిత్స పొందుతున్న మణిపాల్‌ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ సుదర్శన్‌ బల్లాల్‌ స్పందించారు. గస్తీ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారనీ.. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో లైఫ్‌ సపోర్టుపై వైద్య చికిత్స కొనసాగిస్తున్నట్టు స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని