CPI: ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో లోపాలు: సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ

వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ చేపట్టిన ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో లోపాలు వెలుగు చూశాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. 

Updated : 21 Sep 2023 09:26 IST

అమరావతి: వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ చేపట్టిన ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో లోపాలు వెలుగు చూశాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. రిజర్వేషన్ అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులకు తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. ఓపెన్ కేటగిరీ సీట్లను మొదట ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాలను వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ తుంగలో తొక్కిందన్నారు. 

తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థికి ఓపెన్ కేటగిరీలో.. ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థికి రిజర్వేషన్ కేటగిరీలో సీట్లు కేటాయించినట్లు ఆరోపణలున్నాయని రామకృష్ణ పేర్కొన్నారు. దీనికి యూనివర్సిటీ వీసీ బాధ్యత వహించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ను రద్దుచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మళ్లీ కౌన్సెలింగ్‌ నిర్వహించి రిజర్వేషన్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని