Congress: తృణమూల్‌కు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి: జైరాం రమేశ్‌

Congress: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌కు ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లో చేరేందుకు ఇప్పటికీ తలుపులు తెరిచే ఉన్నాయని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ అన్నారు.

Published : 03 Mar 2024 11:48 IST

పట్నా: పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) ఇప్పటికే నిర్ణయించింది. అయినప్పటికీ.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నామని ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లోని ప్రధాన పార్టీ కాంగ్రెస్‌ (Congress) ఆదివారం ప్రకటించడం గమనార్హం.

‘‘మేం తలుపులు ఇంకా మూసివేయలేదు. మొత్తం 42 స్థానాల్లో పోటీ చేస్తామని ఆమె (మమతా బెనర్జీ) ఏకపక్షంగా ప్రకటించారు. అది వారి నిర్ణయం. మా అభిప్రాయం ప్రకారం.. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి. తుది ప్రకటన వచ్చే వరకు మా వైఖరి ఇదే’’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ అన్నారు.

టీఎంసీ అంటే తూ..మై..ఔర్‌ కరప్షన్‌

బిహార్‌ రాజధాని పట్నాలో నేడు ప్రతిపక్ష పార్టీల ర్యాలీ జరగనుంది. భాజపా, దాని మిత్రపక్షాలను ఓడించాలనుకునే విపక్ష పార్టీల ఐక్యతకు ఈ ర్యాలీ నిదర్శనమని జైరాం అన్నారు. దీంట్లో పాల్గొనేందుకు భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తాత్కాలిక విరామమిచ్చారని తెలిపారు. మరోవైపు నిజమైన రాష్ట్రీయ లోక్‌దళ్‌ (RLD) కార్యకర్తలు ఇప్పటికీ కాంగ్రెస్‌కు మద్దతుగానే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ శనివారం అధికారికంగా భాజపా నేతృత్వంలోని ఎన్‌డీయే కూటమిలో చేరిన విషయం తెలిసిందే.

రాహుల్‌ గాంధీ తిరిగి వయనాడ్‌ నుంచే పోటీ చేయాలా.. లేదా.. అనే అంశంపై చర్చ జరుగుతోందని జైరాం తెలిపారు. మరోవైపు భాజపా తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించడంపై వ్యాఖ్యానించబోమన్నారు. కేవలం తమ పార్టీ మేనిఫెస్టో రూపకల్పన, అభ్యర్థుల ఖరారుపైనే దృష్టి సారించామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని