ECI: ఆ 5 రాష్ట్రాల్లో ర్యాలీలపై నిషేధం కొనసాగించాలా? వద్దా?

దేశ వ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతిని కట్టడి చేసే లక్ష్యంతో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో బహిరంగ సభలు, ర్యాలీలపై ఈసీ విధించిన నిషేధం నేటితో ముగియనుంది.......

Published : 22 Jan 2022 15:06 IST

కేంద్ర ఎన్నికల సంఘం సమాలోచనలు

దిల్లీ: దేశ వ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతిని కట్టడి చేసే లక్ష్యంతో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో బహిరంగ సభలు, ర్యాలీలపై ఈసీ విధించిన నిషేధం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో భౌతిక ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధాన్ని మళ్లీ పొడిగించాలా? లేదా అనే అంశంపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వర్చువల్‌ సమావేశాలు నిర్వహించి సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, పంజాబ్‌, మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికలకు జనవరి 8న షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఒమిక్రాన్‌ ప్రభావం నేపథ్యంలో భౌతిక ర్యాలీలు, రోడ్‌షోలు, బైక్‌ ర్యాలీలు వంటి ప్రచార కార్యక్రమాలపై జనవరి 15వరకు నిషేధం ప్రకటించారు. ఆ తర్వాత కేసులు అదుపులోకి రాకపోగా మరింతగా పెరుగుతుండటంతో ఆ నిషేధాన్ని జనవరి 22 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అదేసమయంలో, రాజకీయ పార్టీలు 300 మందికి మించకుండా/50శాతం ఆక్యుపెన్సీతో ఇండోర్‌ సమావేశాలు నిర్వహించుకొవచ్చంటూ వెసులుబాటు కల్పించింది. అయితే, ఇటీవల పొడిగించిన నిషేధాజ్ఞలు నేటితో ముగియనున్నందున కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కేంద్ర ఆరోగ్యశాఖ, వైద్యరంగ నిపుణులు, ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల అధికారులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని