Harish Rao: కాంగ్రెస్‌ 6 గ్యారంటీలు ఏమయ్యాయి?: హరీశ్‌రావు

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. 100 రోజులు గడిచినా వాటిని నెరవేర్చలేదని విమర్శించారు.

Published : 08 Apr 2024 19:49 IST

సిద్దిపేట: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. 100 రోజులు గడిచినా వాటిని నెరవేర్చలేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా  సిద్దిపేటలోని మల్లయ్య గార్డెన్‌లో యువతతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వద్దంటూ తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. 

‘‘రేవంత్‌ ‘జై తెలంగాణ’ అని ఏనాడైనా అన్నారా? భారాస ఉద్యోగాలు ఇస్తే.. కాంగ్రెస్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషనైనా ఇచ్చిందా? నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదని అప్పుడే మాట మార్చారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు. మరి ఈ పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? భారాస ప్రభుత్వం ఎన్నో ఆలయాలు నిర్మించింది. అభివృద్ధి చేసింది. అయినా, దేవుడి పేరుమీద భారాస ఎప్పుడూ ఓట్లు అడగలేదు. సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్న కాంగ్రెస్‌, భాజపాకి బుద్ధి చెప్పాలి’’అని హరీశ్‌రావు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని